రక్త ప్రసరణ సరిగా లేకపోతే ఎన్ని ప్రమాదాలు పొంచి ఉన్నాయో   Dangers Of No Proper Blood Circulation     2016-12-22   03:49:57  IST  Lakshmi P

ఈ శరీరం ఇలా కదులుతోంది అంటే అది రక్త ప్రసరణ వల్లే. ఈ ప్రాణం ఇలాగే నిలిచి ఉంది అంటే అది రక్తప్రసరణ వల్లే. శరీరంలోని ఏ భాగానికి రక్తప్రసరణ సరిగా లేకపోయినా ప్రమాదమే. ఈ విషయాలు జనాలకి తెలీక కాదు .. తెలుసు. అయినా వ్యాయామం ఉండదు, సరైన తిండి ఉండదు. మంచి వ్యాయయం, ఆహారం శరీరానికి ఇవ్వాలంటే, దానిపై భయం కాని,. ప్రేమ కాని పుట్టాలి. ప్రేమ పుట్టాలంటే అది వారి చేతిల్లోనే ఉంది కాని, భయం పుట్టాలంటే మాత్రం మేం చెప్పబోయే విషయాలు చదివితే చాలు.

* రక్తప్రసరణ మెదడుకి సరిగా జరగకపోతే మతిమరుపు పెరిగిపోతుంది. ఈ విషయంపై అయినా సరే, ఆలోచనలు నిలపడం కష్టం ఆయిపోయుంది. మైకం, తలనొప్పి వస్తాయి.

* కిడ్నీలకు రక్తప్రసరణ సరిగా లేకపోతె, కేవలం కిడ్నీలు డ్యామేజ్ అవడమే కాదు, కాళ్ళు చేతుల్లో వాపులు బాగా వస్తాయి.

* కాళ్ళకి సరిగా రక్తప్రసరణ జరగకపోతే నరాలు పట్టేసినట్టు అనిపించడం, ఒక్కోసారి స్పర్శ లేకపోవడం, విపరీతమైన నొప్పులు మొదలవుతాయి.

* రక్తాన్ని సరఫరా చేసేదే గుండె, అక్కడ కూడా రక్తప్రసరణ సరిగా లేకపోతె ఏ పని సరిగా చేయలేరు. గుండె సంబంధిత వ్యాధులు వస్తాయి. బిపి సమస్యలు, హార్ట్ ఎటాక్, కొలెస్ట్రాల్ సమస్యలు వస్తాయి.

* కాలేయానికి రక్తం సరిగా సరఫరా కాకపొతే ఆకలి వేయడం కష్టం. బరువు బాగా తగ్గిపోతారు. స్కిన్ టోన్ కూడా మారిపోవచ్చు.

* జననాంగలకి రక్తప్రసరణ జరగకపోతే అది రిప్రొడక్టివ్ సిస్టం మొత్తాన్ని ప్రమాదంలోకి నెడుతుంది.

కాబట్టి లక్షణాలను బట్టి ఏ భాగంలో సరిగా రక్తప్రసరణ జరగట్లేదో తెలుగుకొని డాక్టర్ ని సంప్రదించండి.

ప్రకటన : తెలుగుస్టాప్ వెబ్ సైట్ లో పని చేయుట కొరకు అనుభవజ్ఞులైన తెలుగు కంటెంట్ రచయితలు,రాజకీయ విశ్లేషకులు,సోషల్ మీడియా ఫొటోస్/వీడియోస్ అడ్మిన్స్,వీడియో ఎడిటర్,వీడియో మేకర్స్,లైవ్ రిపోర్టర్ లు కావలెను..మీ వివరాలను telugustop@gmail.com కు మెయిల్ చేయగలరు.