అతిగా ఎక్సర్‌సైజ్ చేస్తే వ‌చ్చే తిప్ప‌లు ఇవే!!

ఎక్సర్‌సైజ్ చేయ‌డం వ‌ల్ల ఆరోగ్యానికి ఎంతో మంచిదో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు.ఎక్సర్‌సైజ్ కేవలం ఫిట్ నెస్ కు మాత్రమే కాదు.

 Dangerous Side Effects Of Over Exercise-TeluguStop.com

మ‌రెన్నో జ‌బ్బుల నుంచి ర‌క్షించ‌డంలోనూ స‌హాయ‌ప‌డుతుంది.ఒత్తిడికి దూరంగా ఉండాల‌న్నా, మొద‌డు చురుగ్గా ప‌నిచేయాల‌న్నా, గుండె జబ్బులను నివారించాల‌న్నా, మధుమేహం వచ్చే రిస్క్‌ను తగ్గించుకోవాల‌న్నా, ర‌క్త‌పోటు కంట్రోల్‌లో ఉండాల‌న్నా, ఇమ్యునిటీ ప‌వ‌ర్ పెర‌గాల‌న్నా ఖ‌చ్చితంగా ఎక్సర్‌సైజ్ చేయాల్సిందే.

అయితే మనం చేసే ఎక్సర్‌సైజ్ అటు ఆరోగ్యాన్ని, ఇటు ఫిట్‌నెస్‌ను అందించాలే తప్ప మన శరీరానికి హానికరం కాకూడదు.అవును! కొంద‌రు త్వ‌ర‌గా బ‌రువు త‌గ్గేందుకు లేదా ఇత‌రిత‌ర కార‌ణంగా వ‌ల్ల గంట‌లు త‌ర‌బ‌డి ఎక్సర్‌సైజ్ చేస్తుంటారు.

 Dangerous Side Effects Of Over Exercise-అతిగా ఎక్సర్‌సైజ్ చేస్తే వ‌చ్చే తిప్ప‌లు ఇవే-Telugu Health - తెలుగు హెల్త్ టిప్స్ ,చిట్కాలు-Telugu Tollywood Photo Image-TeluguStop.com

కానీ, అతి ఎప్పుడూ అనర్థమే.ఇది ఎక్సర్‌సైజ్ విష‌యంలోనూ వ‌ర్తిస్తుంది.

అతిగా ఎక్సర్సైజ్ చేయ‌డం వ‌ల్ల ఎముకలు పెళుసవడానికి కారణమవుతాయి.మ‌రియు ఎముకలు చాలా వీక్ అయిపోతాయి.

అలాగే మితిమీరిన ఎక్సర్‌సైజ్ వల్ల చిన్నవయసులోనే హృద్రోగాల బారిన పడడంతో పాటు, మరణాల ముప్పు ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెపుతున్నారు.అంతేకాదు, అతిగా ఎక్సర్‌సైజ్ చేయడం వల్ల సంతాన సమస్యలు కూడా తలెత్తుతాయని కొన్ని ప‌రిశోధ‌న‌ల్లో తేలింది.ఇక అతిగా ఎక్సర్‌సైజ్ చేసినప్పుడు శరీరం ఎక్కువ అలసటకు గురై.రోగ‌నిరోధ‌క శ‌క్తి బ‌ల‌హీన‌ప‌డుతుంది.

త‌ద్వారా జలుబు, దగ్గు, ఫ్లూ వంటి స‌మ‌స్య‌లు వ‌చ్చే రిస్క్ ఎక్కువ‌ని అంటున్నారు.అందుకే వారంలో ఐదు లేదా ఆరురోజులు వ్యాయామం చేసి మిగతా సమయంలో ధ్యానం, చిన్న యోగాసనాలు వేయడం మంచిద‌ని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

త‌ద్వారా ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉంటార‌ని అంటున్నారు.

#SideEffects #Health #Fitness Tips #Exercise #Fitness

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు