చికెన్ ఎక్కువగా తింటున్నారా.. అయితే జాగ్ర‌త్త‌!  

dangerous side effects of over eating of chicken! chicken side effects, chicken, over eating chicken, latest news, health tips, health - Telugu Chicken, Chicken Side Effects, Health, Health Tips, Latest News, Over Eating Chicken

శాకాహారుల విష‌యం ప‌క్క‌న పెడితే. మాంసాహారులు ఎంతో ఇష్టంగా తినే నాన్ వెజ్ ఐటెమ్స్‌లో చికెన్ ముందుంటుంది అన‌డంలో సందేహ‌మే లేదు.

TeluguStop.com - Dangerous Side Effects Of Over Eating Chicken

Source:TeluguStop.com.ఈ ఆర్టికల్ తెలుగుస్టాప్.కామ్(TeluguStop.com) నుచి కాపీ చేయబడినది.ఒరిజినల్ ఆర్టికల్ ఇక్కడ క్లిక్ చేసి చదవగలరుTeluguStop.com

వేడి వేడిగా రైస్‌లో లేదా రోటీతో చికెన్ క‌ర్రీ తింటే.అబ్బబ్బబ్బా సూప‌ర్ అంటారు చాలా మంది.అవును! చికెన్ టేస్టీగానే ఉంటుంది.మ‌రియు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది.చికెన్ లో ఉండే క్యాల్షియం, పాస్పరస్, ఐర‌న్‌ వంటి పోష‌కాలు ఎముకల‌ను బ‌ల‌ప‌డేలా చేస్తాయి.

TeluguStop.com - చికెన్ ఎక్కువగా తింటున్నారా.. అయితే జాగ్ర‌త్త‌-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

శ‌రీర రోగనిరోధక శక్తిని పెంచ‌డంలోనూ, జ‌లుబు మ‌రియు ద‌గ్గు స‌మ‌స్య‌ల‌ను త‌గ్గించ‌డంలోనూ చికెన్ గ్రేట్‌గా స‌హాయ‌ప‌డుతుంది.

అలాగే చికెన్ తీసుకోవ‌డం వ‌ల్ల గుండె జ‌బ్బులు ఒత్తిడి, డిప్రెష‌న్ వంటి స‌మ‌స్య‌లు కూడా దూరం అవుతాయ‌ని అంటున్నారు ఆరోగ్య నిపుణులు.ఇక పిల్లలకు చికెన్ పెట్ట‌డం వ‌ల్ల‌ ఎదుగుదలకు తోడ్పడుతుంది.

***

అయితే మితంగా తీసుకుంటేనే ఏ ఆహారమైనా శరీరానికి మేలు చేస్తుంది.ఇది చికెన్ విష‌యంలోనూ వ‌ర్తిస్తుంది.

సాధార‌ణంగా చాలా మంది చికెన్ ఇష్ట‌మ‌ని అతిగా తింటుంటారు.కానీ, అదే మీరు చేసే పొర‌పాటు.

చికెన్ ఆరోగ్యానికి మంచిదే.కానీ, అతిగా తీసుకుంటే మాత్రం అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను తెచ్చిపెడుతుంది.

వాస్త‌వానికి చికెన్‌ను వారానికి రెండు సార్లు తింటే ప‌ర్వాలేదు కానీ, నాలుగైదు సార్లు లేదా వార‌మంతా తీసుకుంటే.ఫుడ్ పాయిజనింగ్, డయేరియా వంటి స‌మ‌స్య‌లు త‌లెత్తుతాయి.అలాగే అతిగా చికెన్ తీసుకోవ‌డం వ‌ల్ల క్యాన్స‌ర్‌, అధిక బ‌రువు పెర‌గ‌డం, గుండె జబ్బులు, డయాబెటిస్ వంటి స‌మ‌స్య‌లు వ‌చ్చే రిస్క్ కూడా ఉంటుందని అంటున్నారు ఆరోగ్య నిపుణులు.చూశారా అతిగా చికెన్ తిన‌డం వల్ల ఎంత డేంజరో.

కాబ‌ట్టి, చికెన్‌ను మితంగా అంటే వారికి ఒక‌టి లేదా రెండు సార్లు తిన‌డం మంచిది.చికెన్ మాత్ర‌మే కాదు.

ఏ ఆహార‌మైన మితంగా తీసుకుంటేనే ఆరోగ్యానికి మంచిది.

#OverEating #Health Tips #ChickenSide #Health #Chicken

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Dangerous Side Effects Of Over Eating Chicken Related Telugu News,Photos/Pics,Images..