వామ్మో.. నాన్ స్టిక్.. ఎంత ప్రమాదమో తెలుసా?  

Dangerous side effects of Non Stick pan , Non Stick pan , Side Effects, Teflon Chemical, Non Stick pan at high temperature - Telugu Dangerous Side Effects Of Non Stick Pan, Non Stick Pan, Non Stick Pan At High Temperature, Side Effects, Teflon, Teflon Chemical, Thyroid Disorders

ప్రస్తుత కాలంలో మారిన ఆహారపు అలవాట్లకు అనుగుణంగా ఆహారం చేసే విధానంలో కూడా మార్పులు సంతరించుకున్నాయి.తినే ఆహారం ఆరోగ్యానికి, రుచిగా కాకుండా, స్టైల్ గా ఉండటమే ప్రజలు ఇష్టపడుతున్నారు.

TeluguStop.com - Dangerous Side Effects Of Non Stick Pan

ప్రస్తుతం ప్రతి ఒక్కరి ఇండ్లలో ఇనుము పాన్ లకు బదులుగా, నాన్ స్టిక్ పాన్ లనే వాడుతున్నారు.ఇందులో దోసె వంటివాటిని వేయడం ద్వారా దోశ అతుక్కోకుండా చాలా బాగా వస్తుందన్న ఉద్దేశంతో ప్రతి ఒక్కరు ఇలాంటి నాన్ స్టిక్ పాన్ మీద వంటలు తయారు చేయడం అలవాటుగా మార్చుకున్నారు.

కానీ నాన్ స్టిక్ పాన్ లను ఉపయోగించడం వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవల్సి వస్తుందని నిపుణులు చెబుతున్నారు.వీలైనంత వరకు వాటిని మానేయడం ఉత్తమమని శాస్త్రవేత్తలు తెలియజేస్తున్నారు.

TeluguStop.com - వామ్మో.. నాన్ స్టిక్.. ఎంత ప్రమాదమో తెలుసా-Telugu Health-Telugu Tollywood Photo Image

సాధారణంగా నాన్ స్టిక్ పాన్ లలో టెఫ్లాన్ అనే రసాయన పదార్థం తో పాన్ ల మీద పూత పోయడం ద్వారా అవి నీటిని నిల్వ చేసుకోకుండా ఉంటాయి.రైన్ కోట్ వంటి తదితర వస్తువులలో కూడా ఈ రసాయనాన్ని వాడుతారు.

అయితే నాన్ స్టిక్ పాన్ లు అధిక ఉష్ణోగ్రత వద్ద వేడి చేయడం ద్వారా వాటిలో ఉన్న రసాయనం తరచూ కొద్ది మొత్తంలో కరుగుతూ మన ఆహారపదార్థాలలో కలవడం ద్వారా తీవ్రమైన తలనొప్పి, థైరాయిడ్ రుగ్మతలు, మూత్రపిండ, కాలేయ వంటి దీర్ఘకాలిక సమస్యలతో బాధ పడాల్సి వస్తుందని నిపుణులు సూచిస్తున్నారు.మరికొందరైతే ఈ పాన్ పై ఉండేటటువంటి టెఫ్లాన్ పూత అంతా కరిగిపోయినా కూడా వాటిని వాడుతూ ఉంటారు.

ఇలాంటి వాటిని వాడటం వల్ల వారి ఆరోగ్యంపై మరింత తీవ్ర ప్రభావం ఏర్పడుతుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.

వీలైనంత వరకు నాన్ స్టిక్ పాన్ లను తగ్గించి, ఇనుముతో చేసిన వాటిపై తయారు చేసుకునే ఆహార పదార్థాలను తీసుకోవడం ద్వారా ఎటువంటి ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా ఉండటమే కాకుండా, మన ఆరోగ్యానికి మరింత ప్రయోజనం కలుగుతుంది, మనం తయారు చేసే ఆహార పదార్థాలు కూడా ఎంతో రుచిగా ఉంటాయి.

వీలైనంత వరకు ఐరన్ తో చేసిన పాన్ లపై ఆహార పదార్థాలను వండుకొని తినడం ఎంతో శ్రేయస్కరం.

#Teflon #DangerousSide #Teflon Chemical #NonStick #Non Stick Pan

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Left Non Stick Do You Know How Dangerous It Is Related Telugu News,Photos/Pics,Images..