కాఫీ..ఉదయం లేవగానే చాలా మంది ఇష్టంగా తాగే పానీయం.మార్నింగ్ కాఫీ తాగనిదే కొందరికి రోజు కూడా గడవదు.
ఇక కొందరు ఉదయమే కాదు.మధ్యాహ్నం, సాయంత్రం ఎప్పుడు పడితే అప్పుడు.
టైమ్ దొరికినప్పుడల్లా కాఫీ తాగుతూ ఎంజాయ్ చేస్తుంటారు.అయితే కాఫీ ఆరోగ్యానికి మంచిదే.
అయినప్పటికీ అతిగా తీసుకుంటే మాత్రం అనర్థాలను ఎదుర్కోవాల్సి వస్తుంది.అవును, అతిగా కాఫీని తీసుకోవడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
మరి ఈ సమస్యలు ఏంటో లేట్ చేయకుండా ఓ లుక్కేసేయండి.
అతిగా కాఫీ తీసుకోవడం అంటే రోజుకు రెండు కప్పులు మించి తీసుకోవడం వల్ల గుండె జబ్బులు వస్తాయి.
ఎందుకంటే.కాఫీ ఓవర్‌గా తాగితే బ్లడ్ ప్రెజర్ పెరుగుతుంది.
దీని వల్ల గుండె వేగం పెరిగిపోతోంది.తద్వారా గుండె పోటు లేదా ఇతర గుండె సమస్యలు ఎదురవుతాయి.
డీహైడ్రేషన్.చాలా మంది ఎదుర్కొంటున్న సమస్య ఇది.అయితే కాఫీని అతిగా తీసుకోవడం వల్ల కూడా శరీరం డీహైడ్రేట్ అయిపోతుంది.
కాఫీని ఎక్కువగా తీసుకున్నప్పుడు.
అందులోఉండే కెఫిన్ అధిక మోతాదులో శరీరంలోకి చేరి శరీరాన్ని డీహైడ్రేట్ చేసేస్తుంది.తద్వారా ఎన్నో సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది.
అలాగే కాఫీని మోతాదుకు మించి తీసుకోవడం వల్ల జీర్ణ శక్తి తగ్గి. జీర్ణ సమస్యలను తెచ్చి పెడుతుంది.
ముఖ్యంగా అజీర్తి, కడుపు ఉబ్బరం, గ్యాస్ ఇలాంటి సమస్యలు వస్తుంటాయి.
అదేవిధంగా, ప్రతి రోజు అతిగా కాఫీని తీసుకోవడం వల్ల శరీరం వివిధ మైక్రో మినరల్స్ గ్రహించే శక్తి కోల్పోతుంది.
ఇక చాలా మంది కాఫీ తాగడం వల్ల బరువు తగ్గుతారని నమ్ముతారు.కానీ, అందులో ఎలాంటి నిజం లేదు.
పైగా కాఫీని అతిగా తీసుకుంటే.శరీరంలో కొవ్వు పెరిగే అవకాశాలు ఎక్కువని అంటున్నారు.
అయితే ఇవన్నీ చూసి కాఫీ తాగడం మాత్రం మానేయకండి.ఎందుకంటే, మోతాదు మించకుండా కాఫీని తీసుకుంటే ఎలాంటి సమస్యలు ఉండవు.
అతిగా తీసుకుంటేనే ఏదైనా సమస్య వస్తుంది.