అమ్మోనియం నైట్రేట్ నిల్వతో ఏపీకి పొంచి ఉన్న ప్రమాదం !

రసాయనాల నిల్వతో ఇప్పటికే పలు ప్రాంతాల్లో, కొన్ని దేశాల్లో భారీ ప్రమాదాలు చోటు చేసుకుంటున్న ఘటనలు చూస్తునే ఉన్నాం.ఇటీవల లెబనాన్ రాజధాని బీరుట్ లో 2700 టన్నుల అమ్మోనియం నైట్రేట్ తో భారీ పేలుడు సంభవించింది.

 Ap, Vishaka, Ammonium Nitrate,storage-TeluguStop.com

ఈ పేలుడులో దాదాపు 200 మంది ప్రాణాలు కోల్పోయారు.వేలాది మంద్రి క్షతగాత్రులయ్యారు.

అయితే తాజాగా రష్యా నుంచి 25 వేల టన్నుల అమ్మోనియం నైట్రేట్ కలిగిన ఓ నౌక విశాఖపట్నం రేవుకు బుధవారం చేరింది.

అయితే బీరట్ లో పేలుడు సంభవించే సమయానికి విశాఖలో 18,500 టన్నుల అమ్మోనియం నైట్రేట్ నిల్వలున్నాయి.

దీంతో నౌకాశ్రయ వర్గాలు అప్రమత్తమయ్యారు.అమ్మోనియం నైట్రేట్ ను నిల్వ ఉన్న గోడౌన్ ను నౌకశ్రయ చైర్మన్ కే.రామ్మోహనరావు పరిశీలించి వీలైనంత త్వరగా తరలించాలని ఆదేశించారు.కానీ, బుధవారం రష్యా నుంచి 25 వేల టన్నుల అమ్మోనియం నైట్రేట్ విశాఖకు చేరడంతో స్థానికుల్లో భయాందోళన నెలకొంది.

నైట్రేట్ నిల్వ ఉన్న ప్రాంతాల్లో ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలకు, రక్షణరంగ సంస్థలకు ముప్పుపొంచి ఉంది.దీంతో చైర్మన్ రామ్మోహనరావు 25 వేల టన్నుల అమ్మోనియం నైట్రేట్ ను గోడౌన్ కు కట్టుదిట్టమైన భద్రతలు ఏర్పాటు చేశామని ఆయన వెల్లడించారు.

వీలైనంత త్వరగా అమ్మోనియం నైట్రేట్ నిల్వలను విశాఖ నుంచి తరలిస్తామని తెలిపారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube