ప్లే స్టోర్‌లోని ఈ యాప్‌ల‌తో డేటా లీక్ అయ్యే ప్ర‌మాదం.. అవేంటంటే..?

ఇప్పుడు పెరుగుతున్న టెక్నాల‌జీతో లాభాలు ఎన్ని ఉన్నాయో న‌ష్టాలు కూడా అన్నే ఉన్నాయ‌ని చెప్పాలి.ఎందుకంటే అవ‌స‌రానికి వినియోగించే టెక్నాల‌జీ చివ‌ర‌కు ఇబ్బందుల‌ను కూడా తెచ్చిపెడుతోంది.

 Danger Of Data Leakage With This App In The Play Store, Play Store, Data Leake,-TeluguStop.com

ఇక మ‌రీ ముఖ్యంగా సైబ‌ర్ నేరగాల్లు అయితే ఏ మాత్రం ఛాన్స్ దొరికినా అమాయకుల ద‌గ్గ‌ర డ‌బ్బులు దోచుకుంటున్నారు.ఇప్పుడు స్మార్ట్ ఫోన్ల వినియోగం కూడా భారీగా పెరిగిపోవ‌డంతో అనేక యాప్‌లు కూడా అందుబాటులోకి వ‌స్తున్నాయి.

ఇక ఇలాంటి ఆండ్రాయిడ్ డివైజ్‌లలో యాప్స్‌ డౌన్‌లోడ్ చేసుకోవాలంటే అంద‌రికీ ముందుగా గుర్తుకు వ‌చ్చేది గూగుల్ ప్లే స్టోర్.

చాలా వ‌ర‌కు జ‌నాలు ఈ ప్లే స్టోర్ నుంచే యాప్‌లు డౌన్‌లోడ్ చేసుకుంటారు.

కాగా ఈ ప్లే స్టోర్‌లో ఇప్పుడు దాదాపుగా 19 వేలకు పైగా యాప్స్ ఉన్నాయి.ఇక ఈ యూజర్ల డివైజ్ సేఫ్టీని ఈ యాప్‌ల‌లో కొన్ని ప్ర‌మాదంలో కూడా ప‌డేస్తున్నాయంట.

తెలియ‌క వాటిని డౌన్‌లోడ్ చేసుకునేందుకు ప్ర‌య‌త్నిస్తే ఇక అంతే సంగ‌తులు అని చెబుతున్నారు నిపుణులు.కాగా ఈ వివ‌రాల‌ను డిజిటల్ సెక్యూరిటీ కంపెనీ అవాస్ట్ రీసెంట్ గా వెల్ల‌డించి సంచ‌ల‌నం రేపింది.

అన్ని స్మార్ట్ ఫోన్ల‌లో ఉండే ప్లే స్టోర్‌లో ఉన్న 19,300 యాప్ ల‌లో వినియోగదారుల వ్యక్తిగత డేటాను బ‌హిర్గ‌తం చేసే మిస్‌కాన్ఫిగరేషన్ ఉన్నాయ‌ని ఆ కంపెనీ వివ‌రించింది.

Telugu Apps, Avast, Avast Antivirus, Leakage, Leake, Harmful Apps, Store-Latest

ఈ యాప్ ల‌లో ఉండే మిస్‌కాన్ఫిగరేషన్ వ‌ల్ల ఈ యాప్స్ వాడిన వినియోగదారుల స‌మాచారం మొత్తం లీక్ అయ్యే ప్రమాదం ఉంద‌ని అవాస్ట్ తెలిపింది.అయితే మిస్‌కాన్పిగరేషన్ అనేది ప్ర‌త్యేక‌మైన లైఫ్‌స్టైల్ తోపాటు వ్యాయామం అలాగే ఎంట‌ర్ టైన్ మెంట్ గేమింగ్స్‌, మెయిల్, ఫుడ్ డెలివరీ లాంటి స‌ర్వీసుల‌కు సంబంధంచిన యాప్‌ల‌ను వాడే వారికి ఎక్కువ‌గా ప్ర‌మాదం ఉంద‌ని తెలిపింది.ఈ డేటా లీకేజీల కార‌ణంగా ప్ర‌తి యాప్‌ను కూడా వెరిఫై చేసిన తరువాతే ప్లే స్టోర్ లో డౌన్‌లోడ్ చేసుకోవ‌డం ఉత్త‌మ‌మ‌ని తెలుపుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube