సినిమా పరిశ్రమలో స్థిర పడాలని చాలా మంది అనుకుంటారు.కాని అందరికీ సినిమా పరిశ్రమలో స్థిరపడే అవకాశం ఉండదు.
సినిమా పరిశ్రమలో నిలదొక్కుకోవడం అంత సులభం కాదు.ఎందుకంటే హిట్స్, ఫ్లాప్స్ ఆధారంగా ఇక్కడ నటీనటుల జీవితాలు మారిపోతుంటాయి.
ముఖ్యంగా హీరోయిన్ లుగా స్థిరపడాలని అనుకున్నా అవకాశాలు అంత సులభం కాదు.ఎందుకంటే సినిమా పరిశ్రమలో హీరోయిన్ గా అవకాశాలు రావాలంటే తప్పనిసరిగా ఎవరైతే ఛాన్స్ కోసం ఎదురుచూస్తున్నారో వారు తప్పక కమిట్ మెంట్ ఇవ్వాలంట అని ఒక విషయం పెద్ద ఎత్తున బయట ప్రచారంలో ఉంది.
అయితే ఇది ప్రచారం అని అనుకున్నా ఇందులో వాస్తవం లేదని కొట్టిపారేయలేము.
అయితే ఈ కాస్టింగ్ కౌచ్ కు సంబంధించి అందరు హీరోయిన్స్ నోరు విప్పక పోయినా, కొంత మంది స్పందిస్తూ వస్తున్నారు.
అయితే తాజాగా దంగల్ భామ కూడా ఈ కాస్టింగ్ కౌచ్ పై స్పందించింది.హీరోయిన్ గా ఛాన్స్ రావడానికి మనం చాలా మందికి కమిట్ మెంట్ ఇవ్వాల్సి ఉంటుందని, నాకు కూడా ఇటువంటి అనుభవం ఎదురైందని దంగల్ భామ ఫాతిమా సనాషేక్ తెలిపింది.
ప్రతి చోట ఉన్నట్టుగానే ఇక్కడ మహిళలపై లైంగిక వేధింపులు ఉన్నాయి.కాని వాటిని ఎదుర్కొన్న తీరుతోనే సినిమా పరిశ్రమలో గెలుపోటములు నిర్ణయించబడుతాయని అన్నారు.