ఆయన తీసే ప్రతీ సినిమా ఇండస్ట్రీ హిట్ అయిపోతోంది     2017-01-09   01:11:24  IST  Raghu V

ఇండస్ట్రీ హిట్ కొట్టాలనేది ప్రతీ నటుడి కల. అది దొరకడం కష్టమైన విషయం కాబట్టి ఇండస్ట్రీ హిట్ ఎప్పటికో ఓసారి దొరుకుతుంది. అసలు ఇండస్ట్రీ హిట్ లేకుండా కెరీర్ ముగించే స్టార్లు ఉన్నారు. కాని నటులందరీలోకి ఆమీర్ ఖాన్ వేరు. అతనికి ఇండస్ట్రీ హిట్ కొట్టడం అంటే మంచినీళ్ళు తాగినంత ఈజీ. దంగల్ ఇప్పుడు బాలివుడ్ లో కొత్త ఇండస్ట్రీ హిట్.

సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్ .. ఇద్దరికి పాతికేళ్ళ కెరీర్లో చెరో రెండు ఇండస్ట్రీ హిట్లు ఉన్నాయి. ఇక ఆమీర్ ఖాన్ గత మూడు చిత్రాలు ఇండస్ట్రీ హిట్లే. ధూమ్ 3 ని మళ్ళీ తానే దాటి పీకేతో ఇండస్ట్రీ హిట్ కొట్టాడు. మళ్ళీ ఇప్పుడు పీకేని తానే దాటి దంగల్ తో మరో ఇండస్ట్రీ హిట్ కొట్టాడు. ఇంకో విషయం చెప్పాలి .. గత ఆరు చిత్రాల్లో 5 ఇండస్ట్రీ హిట్స్ ఉన్నాయి ఆమీర్ కి. ప్రస్తుతం టాప్ 5 బాలివుడ్ చిత్రాల్లో మూడు ఆమీర్ వే.

17 రోజుల్లో 340 కోట్ల నెట్ వసూళ్ళు సాధించి పీకే సాధించిన 338 నెట్ కలెక్షన్లని బ్రేక్ చేసిన దంగల్, ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా 650 కోట్లు వసూళ్ళు రాబట్టింది. అయితే వరల్డ్ వైడ్ గ్రాస్ లో ఇప్పటికి పీకేనే టాప్ లో ఉన్నా, చైనాలో దంగల్ విడుదలయ్యాక ఆ రికార్డు కూడా కనుమరుగు అవడం ఖాయం. పీకేని దాటలేకపోయిన బాహుబలికి ఈరకంగా కొత్త టార్గెట్ ఫిక్స్ చేస్తున్నాడు ఆమీర్.