అతనితో బ్రేకప్.. ఎంతో కుమిలిపోయా.. ఓపెన్ కామెంట్స్ చేసిన దంగల్ బ్యూటీ?

Dangal Beauty Sanya Malhotra Made Open Comments About Her Breakup

సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో పనిచేసే హీరో హీరోయిన్లు ప్రేమలో పడటం సర్వసాధారణం.ఈ విధంగా కొన్ని జంటలు ఆ ప్రేమ బంధంతో వైవాహిక జీవితంలోకి అడుగు పెడితే మరికొందరు మాత్రం బ్రేకప్ చెప్పుకుంటారు.

 Dangal Beauty Sanya Malhotra Made Open Comments About Her Breakup-TeluguStop.com

ఇలా తాను ప్రేమించిన వ్యక్తితో బ్రేకప్ చెప్పుకొని వెళ్లిపోయానని తాజాగా తన లవ్ స్టోరీ గురించి దంగల్ బ్యూటీ సన్యా మల్హోత్రా తన లవ్ స్టోరీ గురించి బయట పెట్టారు.అమీర్ ఖాన్ హీరోగా సన్యా మల్హోత్ర హీరోయిన్ గా దంగల్ చిత్రం ద్వారా టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయమయ్యారు.

ఈ సినిమా ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈ బ్యూటీ తాజాగా నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన ‘మీనాక్షి సుందరెశ్వర్’ అనే మూవీతో మరొక విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది.

 Dangal Beauty Sanya Malhotra Made Open Comments About Her Breakup-అతనితో బ్రేకప్.. ఎంతో కుమిలిపోయా.. ఓపెన్ కామెంట్స్ చేసిన దంగల్ బ్యూటీ-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇదిలా ఉండగా తాజాగా ఈ ముద్దుగుమ్మ బ్రైడ్స్ టుడేకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన లవ్ లైఫ్ గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది.

ఈ ఇంటర్వ్యూలో భాగంగా లవ్ ఎట్ ఫస్ట్ సైట్ గురించి మాట్లాడుతూ… తను  చాలా రిజర్వుడ్ గా ఉంటానని, నాకు 29 సంవత్సరాలు వయసు అయినప్పటికీ నాలో ఎనభై తొమ్మిది సంవత్సరాల బామ్మ ఉందని అందు కోసమే తాను ఎవరితోనూ పెద్దగా మాట్లాడనని ఈ సందర్భంగా ఈమె వెల్లడించారు.

Telugu Breakup, Dangle, Love, Sanyamalhotra-Movie

నాలో ఒక ముసలావిడ ఉన్నట్లు భావిస్తాను కనుక నా మనసుకు ఎవరైనా నచ్చితే అతనితో ఫోన్లో లేదా మెసేజ్ రూపంలో నాలో ఉన్నటువంటి భావాలను తనకు వ్యక్తపరుస్తానని ఇలా చేయడం కొద్దిగా కష్టమే అయినప్పటికీ ధైర్యం చేసుకుని ఈ పని చేస్తానని ఈ సందర్భంగా లవ్ ఎట్ ఫస్ట్ సైట్ గురించి ఆమె వెల్లడించారు.ఇక ప్రస్తుతం తాను ఎవరితోనూ రిలేషన్ ల్లో  లేదని గత కొన్ని సంవత్సరాల నుంచి తాను సింగిల్ గా ఉంటూ తన గురించి తాను ఆలోచిస్తున్నట్లు తెలిపారు.

Telugu Breakup, Dangle, Love, Sanyamalhotra-Movie

ప్రస్తుతం తాను ఎవరితోనూ రిలేషన్ ల్లో లేదు కనుక తన దృష్టి మొత్తం తన పైనే ఉందని అదే ఎవరితోనైనా రిలేషన్ లో ఉన్నప్పుడు మన ఫోకస్ మొత్తం వారిపై ఉంటుందని చెప్పిన ఈమె గతంలో తనకు లవ్ బ్రేకప్ అయిందని తన బ్రేకప్ గురించి బయట పెట్టారు.ఒక వ్యక్తిని ఎంతగానో ఇష్టపడి అతనితో బ్రేకప్ అయితే ఆ బాధ ఎలా ఉంటుందో చెప్పడం ఎంతో కష్టమని ఈమె తెలిపారు.తాను ఒక వ్యక్తితో నాలుగు సంవత్సరాలు లవ్ లో ఉన్నానని అతనితో బ్రేకప్ కావడం వల్ల ఎంతో కుమిలిపోయాను అని ఆ బాధ భరించడం చాలా కష్టంగా ఉందని ఈమె తెలిపారు.

Telugu Breakup, Dangle, Love, Sanyamalhotra-Movie

ఢిల్లీ లో ఉన్నప్పుడు నాలో ఈ ప్రేమ కలిగిందని ముందుగా అతనితో బ్రేకప్ అయిందని తెలిపారు.అయితే బ్రేక్ అప్ తర్వాత ఇతరుల గురించి కాకుండా తన గురించి మాత్రమే ఆలోచించుకోవాలని తనకు అర్థమైందని ఇలా తన గురించి తాను ఆలోచించుకోవడానికి 2020 సంవత్సరం తనకు ఎంతో ఉపయోగపడిందని ఈ సందర్భంగా ఈమె తన బ్రేకప్ గురించి చెబుతూ ప్రస్తుతం సింగిల్ గా మాత్రమే ఉన్నానని తెలిపారు.ఒక వ్యక్తితో రిలేషన్ లో ఉన్నప్పుడు వారి ప్రేమను మాత్రమే కాకుండా అతనిలో ఉన్న తప్పులను కూడా కచ్చితంగా తెలుసుకోవాలని అలా తెలుసుకున్నప్పుడే వారి మధ్య ఉన్న బాండింగ్ స్ట్రాంగ్ అవుతుందని తెలిపారు.

#SanyaMalhotra #Love #Breakup #Dangle #SanyaMalhotra

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube