నాకు ఆత్మహత్య చేసుకోవాలనిపిస్తుంది..! దంగల్ నటి సంచలన వ్యాఖ్యలు.! అసలేమైంది?

తనకిష్టం లేకపోయినా తండ్రి కోరిక ప్రకారమే ముష్టియుద్దానికి దిగిన పదిహేనేళ్ల ఆ పిల్ల ప్రత్యర్ది ఎవరున్నా లెక్క చేయకుండా తుక్కుతుక్కుగా చితక్కొట్టి,బరిలోకి దిగితే తనకెవరూ సాటి లేరు అన్నట్టుగా గీతా పొగట్ పాత్రలో ఒదిగిపోయింది నటి జైరా వసీం.దంగల్ సినిమా తర్వాత జైరా కి ఎన్నో అవకాశాలొచ్చాయి .

 Dangal Actress Zaira Wasim Opens Up Aboutdepression-TeluguStop.com

వాటన్నింటిని కాదని సీక్రెట్ సూపర్ స్టార్ అనే సినిమా చేసింది జైరా.ఆ సినిమ ాలో తన నటనతో అందరిని ఆకట్టుకున్న జైరా తనకు ఆత్మహత్య చేసుకోవాలనుందంటూ పోస్టు పెట్టడం సంచలనం అయింది.

“కొన్ని రోజులుగా మానసికంగా కుంగిపోయాను.ఒత్తిడిని తట్టుకోలేకపోతున్నాను.నాలుగేళ్లుగా ఏదో జబ్బు పీడిస్తున్నది.ఓ దశలో ఆత్మహత్య కూడా చేసుకోవాలనిపిస్తున్నది .మానసిక ఒత్తిడి నుంచి బయటపడేందుకు ప్రతీరోజు ఐదు యాంటీ డిప్రెషన్ మెడిసిన్స్ తీసుకొంటున్నాను.ఒక్కోసారి విపరీతమైన బాధతో రాత్రిపూట కూడా ఆస్పత్రికి వెళ్లాల్సి వస్తున్నది.

కొన్ని వారాల పాటు సరిగ్గా నిద్ర ఉండటం లేదు.కొన్ని సందర్భాల్లో విపరీతంగా నిద్రపోతున్నాను .ఇలాంటి మానసిక రుగ్మత వల్ల మితిమీరిన ఆహారాన్ని తీసుకొంటున్నాను.ఒక్కోసారి ఏదీ తినాలని అనిపించదు.

కొన్నిసార్లు భోజనం చేయకుండా పస్తులతో ఉంటున్నాను.ఈ రుగ్మత వల్ల ఒంటినొప్పులు, శరీరం వాచిపోవడం వల్ల విపరీతమైన బాధ కలుగుతున్నది.

నాకు 12 ఏళ్ల వయసులో తొలిసారి తీవ్రమైన ఒత్తిడికి గురయ్యాను.రెండోసారి 14 ఏళ్ల వయసులో ఇలాంటి బాధను అనుభవించాను.ఆ తర్వాత లెక్కలేనన్ని పానిక్ అటాక్స్.ఎన్ని మందులు వాడానో కూడా తెలియదు అని జైరా ఆవేదన వ్యక్తం చేసింది.

సాధారణంగా 25 ఏళ్లు దాటితేనే మానసిక రుగ్మతకు చికిత్స ఉంటుంది అని వైద్యులు వెల్లడిస్తున్నారు.చికిత్స కోసం వెళితే 17 ఏళ్లకే డిప్రెషనా? ఈ వయసులో డిప్రెషన్ ఏంటని వైద్యులు ప్రశ్నిస్తున్నారు అని తన పోస్టులో పేర్కొన్నారు.ఇలాంటి పరిస్థితుల్లో పూర్తి విశ్రాంతి కోరుకొంటున్నాను.స్కూల్‌కు వెళ్లడం కూడా మానేస్తాను.సోషల్ మీడియాకు దూరంగా ఉంటాను.నా బాధలు అర్థం చేసుకొని అండగా నిలిచిన నా కుటుంబ సభ్యులకు రుణపడి ఉంటాను” ఇదీ జైరా పోస్టు సారాంశం.

సినిమా వారు డిప్రెషన్లోకి వెళ్లడానికి ఏకైక రీజన్ కంపారిజన్,అవకాశాలు లేకపోవడం.జైరా వసీం కూడా ఇవే అంశాలతో బాదపడుతుందా.అయినా తన వయస్సు ఇప్పుడు పదిహేడేళ్లే.బాలివుడ్లో నటించడానికి ఇంకా బోలెడు టైం ఉంది.తన దగ్గర టాలెంట్ కి కొదవలేదు.వయసు అయిపోలేదు.

టాలెంట్ ఉన్నవారి దగ్గరకి ఆటోమేటిగ్గా అవకాశాలొస్తాయి.కాబట్టి ముందు సినిమాల గురించి ఆలోచించడం మానేసి తన హెల్త్ గురించి కేర్ తీసుకుంటే బాగుంటుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube