మీ అందాన్ని రెట్టింపు చేయడంలో జుట్టు ప్రధాన పాత్ర పోషిస్తుంది.కానీ చాలామంది తమ జుట్ట ఎక్కువగా ఊడిపోతుందని తెగ బాధపడిపోతుంటారు.
ఆకర్షణీయమైన, పొడవాటి జుట్టు కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు.జుట్టు ఊడిపోవడానికి తలలో ఉన్న చుండ్రు కూడా ఒక కారణం అనే చెప్పాలి.
వాతావరణంలో ఉండే అధిక తేమ కారణంగా తలపై డాండ్రఫ్ ఏర్పడుతుంది.ఒక్కోసారి ఈ చుండ్రు సమస్య తలపైన మాత్రమే కాకుండా కనుబొమ్మలు, భుజాలపై కూడా ఏర్పడి మన చర్మం పొడిబారేలా చేస్తుంది.
అయితే చుండ్రు సమస్య తగ్గించుకోవడానికి ఏవి పడితే అవి వాడడం మంచిది కాదని నిపుణులు సలహాలు ఇస్తున్నారు.వాటి వలన సమస్య తగ్గడం మాట అటుంచితే సమస్యలు తీవ్రతరమయ్యే ప్రమాదం ఎక్కువ.
వయస్సు , వాతావరణం, అధిక పని ఒత్తిడి, ఇతర అనారోగ్య సమస్యలు, హెయిర్ డ్రయర్స్ విపరీతంగా వాడటం, అలర్జీ వంటి కారణాల వల్ల చుండ్రు సమస్య తరచూ వస్తూ ఉంటుంది.
ఫలితంగా జుట్టు కూడా రాలిపోవడంతో పాటు బట్టతల వచ్చే ప్రమాదం కుడా ఉంది.
మరి ఈ డాండ్రఫ్ కు చెక్ పెట్టాలంటే ఏమి చేయాలో కూడా చదవండి.తలపై ఉండే చర్మ తత్వాన్ని బట్టి షాంపూలు, ఇతర హెయిర్ కేర్ ఉత్పత్తులను ఎంచుకోవాలంటున్నారు నిపుణులు.
అలాగే కొంతమంది తల స్నానం చేస్తే జుట్టు ఊడిపోతుంది అనే అపోహలో ఉంటారు.అలా కొన్ని రోజులు పాటు తలస్నానం చేయకుండా ఉంటారు.
ఇలా చేయడం వలనే తలలో చుండ్రు వచ్చే అవకాశం ఉంది.అందుకే వారానికి కనీసం మూడు సార్లు అయిన తలస్నానం చేయాలి.
అలాగే కొందరు జుట్టు ఊడిపోకుండా ఉండాలని మినోక్సిడిల్ లాంటి మెడిసిన్ వాడుతుంటారు.ఐతే దీనివల్ల కూడా చుండ్రు వచ్చే అవకాశం ఉందట.అలాగే మీరు తల దువ్వుకునే మీ దువ్వెనను వేరొకరితో అసలు షేర్ చేసుకోకూడదు.మీరు ఇతరులు వాడిన దువ్వెనను కూడా ఉపయోగించకూడదు.తలకు నూనె కూడా క్రమం తప్పకుండా పెడుతూ ఉండాలి.జుట్టు ఆరబెట్టుకోవడం కోసం హెయిర్ డ్రైయర్స్ ను ఎక్కువగా ఉపయోగించకూడదు.
కాగా తక్కువ చుండ్రు ఉన్నవాళ్లకు ఎక్కువ జుట్టు సమస్యలు రావు.కానీ చుండ్రుతో పాటు ఇతర చర్మ సమస్యలు కూడా వచ్చి ఉంటే తప్పకుండా సరైన ట్రీట్మెంట్ తీసుకోవాలి.
ఆ సమయంలో మీరు కనుక హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ ప్రొసీజర్ ని అనుసరించాలి అనుకుంటే ముందు తప్పకుండా చుండ్రుని కంట్రోల్ చేసాకే జుట్టు ట్రాన్స్‌ప్లాంట్ చేయించుకోండి.అప్పుడే రిజల్ట్స్ సరిగా వస్తాయి.