గసగసాలలో ఇది కలిపి రాస్తే చుండ్రు జన్మలో రాదు....బెస్ట్ చిట్కా   Dandruff Cure Tips In Telugu     2018-02-04   21:18:32  IST  Raghu V

చుండ్రు సమస్య రావటానికి అనేక కారణాలు ఉన్నాయి. చుండ్రు సమస్య వచ్చిందంటే ఒక పట్టాన పోదు. చాలా ఇబ్బందులకు గురి చేస్తుంది. తల మీద చర్మం పొట్టులా రాలుతుంది. దాన్నే చుండ్రు అని అంటారు. చుండ్రు రావటానికి ఒత్తిడి, మాన‌సిక ఆందోళ‌న‌, దీర్ఘ కాలిక అనారోగ్య స‌మ‌స్య‌లు, పోష‌ణ లోపం వంటివి కారణాలుగా చెప్పవచ్చు. కొన్ని ఇంటి చిట్కాల ద్వారా చుండ్రును సమర్ధవంతంగా సులభంగా వదిలించుకోవచ్చు. ఇప్పుడు ఆ చిట్కాల గురించి వివరంగా తెలుసుకుందాం.

గసగసాలను పాలతో కలిపి నూరి తలకు పట్టించి అరగంట తర్వాత తలస్నానము చేస్తే చుండ్రు తొలగిపోతుంది.

వేప ఆకుల‌ను నీటిలో వేసి బాగా మ‌రిగించి చ‌ల్లారాక ఆ నీటితో త‌ల‌ను క‌డిగితే చుండ్రు తొలగిపోతుంది.

ఒక కప్పు గోరు వెచ్చ‌ని నీటిలో ఒక టీస్పూన్ టీ ట్రీ ఆయిల్‌ను కలపాలి. ఈ మిశ్రమంతో జుట్టుకి మర్దనా చేయాలి. అరగంట తరువాత త‌ల‌స్నానం చేస్తే చుండ్రు బాధ తొలగిపోతుంది.

తులసి ఆకులు, ఉసిరి కాయ‌ల‌ను కలిపి పేస్ట్ లా చేయాలి. ఆ పేస్ట్‌ను జుట్టుకి పట్టించి మృదువుగా మసాజ్ చేయాలి. ఒక గంట సేపు అలానే వదిలేసి ఆ తర్వాత కడిగేయాలి. దీంతో చుండ్రు స‌మ‌స్య నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది. ఉసిరి కాయ లేక‌పోతే ఉసిరి పొడిని వాడ‌వ‌చ్చు.

వెనిగ‌ర్‌, నిమ్మ రసాల‌ను సమాన పరిమాణంలో తీసుకుని బాగా క‌లిపి మిశ్ర‌మంగా చేసి దాన్ని జుట్టుకు రాసి మసాజ్ చేయాలి. అరగంట అయ్యాక త‌ల‌స్నానం చేస్తే చుండ్రు రాదు.

కలబంద గుజ్జుతో జుట్టుకు మసాజ్ చేసి 15 నిమిషాలు తర్వాత త‌లస్నానం చేయాలి. దీంతో చుండ్రు తొల‌గిపోతుంది.

కొబ్బరినూనెలో వేప పేస్ట్ వేసి మరిగించి వడకట్టిన నూనెను వాడితే మంచిది. జుట్టుకు పోషణ అందటమే కాకుండా చుండ్రు కూడా తొలగిపోతుంది. జుట్టు దృడంగా, ఒత్తుగా పెరిగి కాంతివంతంగా మారుతాయి.

కొబ్బ‌రినూనె, ఆముదంల‌ను కొద్దిగా స‌మ‌పాళ్ల‌లో తీసుకుని గోరువెచ్చగా చేసి జుట్టుకు రాయాలి. ఈ విధంగా వారంలో 3, 4 సార్లు చేస్తే మంచి ఫ‌లితం ఉంటుంది.

రాత్రి సమయంలో మెంతులను నానబెట్టి మరుసటి రోజు ఉదయం మెత్తని పేస్ట్ లా రుబ్బాలి. త‌రువాత ఒక మిక్సీ చేయాలి . ఈ పేస్ట్ ని జుట్టుకు పట్టించి అరగంట తర్వాత తేలికపాటి షాంపూ తో తలస్నానము చేయాలి. ఈ విధంగా వారంలో రెండు సార్లు చేస్తే చుండ్రు సమస్య తగ్గిపోతుంది.