చీరలో జిమ్నాస్టిక్స్ చేసిన కన్నడ నటి, కొరియోగ్రాఫర్- Dancer Rukmini Vijayakumar Perform Amazing Stunts In Saree

dancer rukmini vijayakumar perform amazing stunts in saree, Gymnastics, Indian Classical Dance,latest news - Telugu Amazing Stunts In Saree, Dancer Rukmini Vijayakumar, Gymnastics, Indian Classical Dance

వెస్ట్రన్ వ్యామోహంలో ఇండియన్ కల్చర్, ట్రెడిషన్, డ్రెస్సింగ్ స్టైల్ ని మన అమ్మాయిలు పూర్తిగా విష్మరిస్తున్నారు.ఓ విధంగా చెప్పాలంటే చాలా మంది మగువలకి ఇండియన్ కల్చర్, ట్రెడిషన్ కంటే ఫారిన్ మోజు ఎక్కువగా ఉంటుంది.

 Dancer Rukmini Vijayakumar Perform Amazing Stunts In Saree-TeluguStop.com

అయితే కొంత మంది మాత్రం ఇండియన్ ట్రెడిషన్, డ్రెస్సింగ్ స్టైల్ గొప్పతనం చెప్పే ప్రయత్నం చేస్తుంటారు.అంతర్జాతీయ వేదికల మీద కూడా తమ మాతృభూమి మీద ఉండే ప్రేమని తమ టాలెంట్ ద్వారా ప్రదర్శిస్తూ ఉంటారు.

అలాంటి వారికి మంచి ఆదరణ కూడా దక్కుతుంది.అలా ఇండియన్ కల్చర్, ట్రెడిషన్, డ్రెస్సింగ్ స్టైల్ తో ఏదైనా చేయొచ్చని కన్నడ నటి, కొరియోగ్రాఫర్, క్లాసికల్ డాన్సర్ రుక్మిణీ విజయ్ కుమార్ చూపిస్తూ ఉంటారు.

 Dancer Rukmini Vijayakumar Perform Amazing Stunts In Saree-చీరలో జిమ్నాస్టిక్స్ చేసిన కన్నడ నటి, కొరియోగ్రాఫర్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ కారణంగానే ఆమెకి సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది.ఇదిలా ఉంటే తాజాగా ఈమె షేర్ చేసిన ఒక వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది.

దీనికి కారణం ఆ వీడియోలో ఆమె చీరకట్టులో జిమ్నాస్టిక్స్ విన్యాసాలు చేయడమే.

స్పిట్స్, బ్లాక్ ప్లిప్, హెడ్ స్టాండ్‌తోపాటు మ‌రిన్ని యోగా స్టంట్స్ వేసింది.

ప్ర‌పంచ‌యోగా దినోత్స‌వం సంద‌ర్బంగా గ‌తేడాది డైరెక్ట్ చేసిన వీడియోలో నుంచి ఒక‌టి.న‌మామి యోగా విద్యే అంటూ క్యాప్ష‌న్ ఇచ్చింది.ఈ వీడియోను 6.5 ల‌క్షల మందికి పైగా వీక్షించ‌గా.వేల సంఖ్య‌లో కామెంట్లు, లైక్స్ వ‌చ్చాయి.చీర‌క‌ట్టులో వీరనారిలా స్టంట్స్ చేస్తున్న వీడియో నెటిజ‌న్ల‌ను అమితంగా ఆక‌ట్టుకుంటోంది.అలాగే ఈమె గతంలో షేర్ చేసిన వీడియోలని కూడా నెటిజన్లు వెతికి మరీ చూస్తున్నారు.రుక్మిణి రాధాక‌ల్ప డ్యాన్స్ కంపెనీ ఆర్టిస్టిక్ డైరెక్ట‌ర్‌గా వ్య‌వ‌రిస్తోంది.

#DancerRukmini #AmazingStunts #IndianClassical #Gymnastics

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు