ఎన్టీఆర్ ఇంటిని అలాంటి పనులకు ఉపయోగిస్తున్నారంటున్న డ్యాన్స్ మాస్టర్...

ఇటీవల కాలంలో సీనియర్ డాన్స్ కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్ నిత్యం ఏదో ఒక ప్రముఖ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొంటూ ఎవరో ఒకరి పై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తునే ఉన్నాడు.ఇటీవల కాలంలో అప్పట్లో మీటూ ఉద్యమం తో మహిళలపై జరుగుతున్న లైంగిక వేధింపుల కు పై పోరాడుతున్న శ్రీ రెడ్డి పై తీవ్ర వ్యాఖ్యలతో విరుచుకుపడిన సంగతి తెలిసిందే.

 Dance Master Rakesh Master Sensational Comments On Ntr Housei-TeluguStop.com

దాంతో శ్రీ రెడ్డి కూడా అదే స్టైల్లో రిప్లై ఇస్తూ రాకేష్ మాస్టర్ పై పలు అనుచిత వ్యాఖ్యలు చేసింది.అంతేకాక ఈ మధ్యకాలంలో రాకేష్ మాస్టర్ తనకు శ్రీ రెడ్డి ఫ్యాన్స్ నుంచి ప్రాణహాని ఉందంటూ హైదరాబాద్ నగరంలో బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇచ్చిన సంగతి తెలిసిందే.

అయితే తాజాగా మరోసారి జూనియర్ ఎన్టీఆర్ పై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసాడు రాకేష్ మాస్టర్.ఇందులో తనకి జూనియర్ ఎన్టీఆర్ అంటే చాలా అభిమానమని కానీ అతడి కంటే సీనియర్ ఎన్టీఆర్ అంటే తనకు అమితమైన అభిమానం అని అన్నారు.

అంతేగాక జూనియర్ ఎన్టీఆర్, సీనియర్ ఎన్టీఆర్ అంశతో పుట్టినా  కానీ తనకు మాత్రం సీనియర్ ఎన్టీఆర్ అంటేనే అమితమైన గౌరవం అని అన్నారు.అంతేకాక మద్రాసులో సినిమాలు చేస్తూ సీనియర్ ఎన్టీఆర్ కష్టపడి కొనుక్కున్నఇల్లు ని ప్రస్తుతం కొందరు గుర్తుతెలియని వ్యక్తులు అసాంఘిక కార్యకలాపాలకు వాడుతున్నారని ఆ విషయం గురించి పలుమార్లు చెప్పినప్పటికీ ఎవరూ పట్టించుకోవడం లేదని వాపోయారు.

అంతేగాక ఆ ఇంటిని స్వర్గీయ నందమూరి తారకరామారావు మ్యూజియం పేరుతో ఓ మ్యూజియాన్ని ఏర్పాటు చేయాలని కూడా కోరారని అయితే తన వ్యాఖ్యలు పట్టించుకోవడం లేదని అంటున్నారు.

Telugu Rakeshmaster, Rakesh Master-Movie

కానీ హైదరాబాదులో తాను నివాసం ఉంటున్నటువంటి ఓ ఇంటిని సీనియర్ ఎన్టీఆర్ పేరుతో అనాథశ్రమం ఏర్పాటు చేస్తానని అన్నారు.అయితే ఈ విషయం ఇలా ఉండగా ఇటీవల కాలంలో రాకేష్ మాస్టర్ పలు రకాల యూట్యూబ్ ఛానెళ్ళకి ఇంటర్వ్యూలో పాల్గొంటూ టాలీవుడ్ సెలెబ్రెటీలపై విరుచుకు పడుతూన్నాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube