దర్శకుడుగా మారుతున్న మరో కొరియోగ్రాఫర్  

దర్శకుడుగా మారుతున్న గణేష్ మాస్టర్. .

Dance Choreographer Turned As A Director-ganesh Master,telugu Cinema,tollywood,turned As A Director

గబ్బర్ సింగ్ సినిమాలో భాగా పాపులర్ అయిన పవన్ కళ్యాణ్ ఇంట్రడక్షన్ సాంగ్ దేకో దేకో గబ్బర్ సింగ్ ఎంత సూపర్ హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే. ఆ సాంగ్ లో పవన్ కళ్యాణ్ స్టెప్స్ వేయించిన కొరియోగ్రాఫర్ గణేష్ మాస్టర్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు. ఇప్పుడు ఈ కొరియోగ్రాఫర్ టాలీవుడ్ లో కొరియోగ్రాఫర్ నుంచి దర్శకులుగా మారిన వారి జాబితాలో చేరిపోతున్నట్లు తెలుస్తుంది..

దర్శకుడుగా మారుతున్న మరో కొరియోగ్రాఫర్ -Dance Choreographer Turned As A Director

ఆయన దర్శకత్వంలో కొత్త వారితో సినిమా ఉంటుందని తెలుస్తోంది.ఇప్పటికే టాలీవుడ్ లో కోరియోగ్రఫర్స్ గా రాణించిన ప్రభుదేవా, లారెన్స్, అమ్మ రాజశేఖర్ లాంటి వారు తరువాత దర్శకులుగా టర్న్ తీసుకున్నారు. వీరిలో ప్రభుదేవా, లారెన్స్ సక్సెస్ ఫుల్ దర్శకులుగా వరుస హిట్ సినిమాలతో జోష్ మీద ఉన్నారు.

వీరి దారిలోనే గణేష్ మాస్టర్ కూడా దర్శకుడుగా టర్న్ తీసుకొని ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ లో ఉన్నట్లు తెలుస్తుంది. ఇక ఈ సినిమాపై మరో 2 నెలల్లో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని తెలుస్తుంది. మరి ఇప్పటికే కొరియోగ్రాఫర్ గా స్టార్ హీరోలతో చేసిన గణేష్ మాస్టర్ దర్శకుడుగా ఎంత వరకు సక్సెస్ అవుతాడో అనేది వేచి చూడాలి.