జక్కన్నను వదిలేందుకు దానయ్యకు 100 కోట్ల ఆఫర్‌  

  • ‘బాహుబలి’ వంటి బ్లాక్‌ బస్టర్‌ సక్సెస్‌ను దక్కించుకున్న రాజమౌళి ప్రస్తుతం ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్‌లతో మల్టీస్టారర్‌ చిత్రాన్ని తెరకెక్కించేందుకు స్క్రిప్ట్‌ వర్క్‌లో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రాన్ని దానయ్య దాదాపు 300 కోట్లతో నిర్మించబోతున్న విషయం తెల్సిందే. చాలా సంవత్సరాల క్రితం జక్కన్నకు దానయ్య అడ్వాన్స్‌ ఇచ్చాడు. ఆ అడ్వాన్స్‌కు కట్టుబడి దానయ్య బ్యానర్‌లో రాజమౌళి సినిమా చేస్తున్నాడు. అయితే దానయ్యను ఈ ప్రాజెక్ట్‌ నుండి తప్పించి తమ నిర్మాణ సంస్థలో ఈ చిత్రాన్ని నిర్మించేందుకు ఇద్దరు నిర్మాతలు తెగ ప్రయత్నాలు చేస్తున్నారు.

  • Danayya Rejects Rs 100 Crore Offer-

    Danayya Rejects Rs 100 Crore Offer

  • ఆ నిర్మాతలు దానయ్యకు 100 కోట్లు ఇచ్చేందుకు సిద్దం అయ్యారు. సినిమా ఇంకా ప్రారంభం కాకుండానే నిర్మాత దానయ్య పెద్దగా ఖర్చు పెట్టకుండానే ఈ ప్రాజెక్ట్‌ను తమకు అప్పగించేందుకు 100 కోట్ల రూపాయను ఇచ్చేందుకు సిద్దం అవుతున్నారు. కాని దానయ్య మాత్రం ఎంత ఖర్చు అయినా తానే నిర్మిస్తాను, ఏమాత్రం వెనకడుగు వేయకుండా రాజమౌళితో సినిమాను నేను నిర్మించి తీరుతాను అంటూ వారికి గట్టిగానే చెప్పినట్లుగా తెలుస్తోంది.

  • Danayya Rejects Rs 100 Crore Offer-
  • 300 కోట్ల బడ్జెట్‌తో రూపొందబోతున్న ఈ చిత్రం సునాయాసంగా వెయ్యి కోట్లను రాబట్టడం ఖాయం. అలాంటి సమయంలో ఎందుకు దానయ్య ఈ చిత్రం నుండి తప్పుకుంటాడు. అలా ఏ తెలివి తక్కువ నిర్మాత కూడా చేయడు. రాజమౌళితో సినిమా అంటేనే అద్బుతం. ఆయనతో సినిమా నిర్మించే అవకాశం రావడం గొప్ప అదృష్టంగా భావిస్తారు. అలాంటి అదృష్టంను తమకు ఇచ్చేయండి అంటూ దానయ్యను కోరితే ఆయన ఇచ్చేందుకు ఏమైనా తెలివి తక్కువ వాడా చెప్పండి.

  • రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్‌, చరణ్‌ల మల్టీస్టారర్‌ను నిర్మించి, తన బ్యానర్‌ స్థాయిని పెంచాలని దానయ్య భావిస్తున్నాడు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా కూడా వాటిని ఎదుర్కొని సినిమాను విడుదల చేస్తామంటూ ఈ సందర్బంగా నిర్మాత దానయ్య సన్నిహితులతో అంటున్నట్లుగా తెలుస్తోంది. డిసెంబర్‌లో ఈ చిత్రం రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభించి వచ్చే 2020లో విడుదల చేయబోతున్నారు.