గత నెలలో డల్లాస్‌ను వణికించిన టోర్నడో కారణంగా నగరంలో భారీ విధ్వంసం జరిగిన సంగతి తెలిసిందే.ఆయా ప్రాంతాలను యథాస్థితికి తీసుకురావడానికి సుమారు 60 మిలియన్ డాలర్లు ఖర్చవుతాయని అధికార యంత్రాంగం లెక్క తేల్చింది.
డల్లాస్ ఫైనాన్షియల్ ఆఫీసర్ ఎలిజబెత్ రీచ్ మాట్లాడుతూ.జరిగిన నష్టంలో 45 మిలియన్ డాలర్ల ఆస్తికి ఎలాంటి ఇన్సూరెన్స్ చేయలేదని.ఫెడరల్ ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్ ఏజెన్సీ(FEMA) నిబంధనల ప్రకారం డల్లాస్ కౌంటీకి 38.5 మిలియన్ డాలర్ల సాయం మాత్రమే అందుతుందని రీచ్ పేర్కొన్నారు.
ఫెమా ఆర్ధిక సహాయానికి ప్రభుత్వ సంస్థలు అర్హత సాధిస్తాయని తాము భావిస్తున్నామని.అయితే బీమా చేయని గృహ యజమానులు మాత్రం అనర్హులని డల్లాస్ అధికారులు తెలిపారు.ఎందుకంటే ఇన్సూరెన్స్ చేయని 800 గృహాలు నాశనమయ్యాయని వీరకి సాయం అందాలంటే పెద్ద నష్టం వాటిల్లిందని రాష్ట్రం చూపించాల్సి ఉంటుందన్నారు.డల్లాస్ కౌంటీ ఒకవేళ ఫెమా నిబంధనలకు అనుగుణంగా ఆర్ధిక సాయానికి అర్హత సాధిస్తే… ప్రభుత్వ సంస్థల ఖర్చులో సుమారు 75 శాతం ప్రభుత్వం భరిస్తుందని ఉన్నతాధికారులు పేర్కొన్నారు.
ఫెడరల్ ప్రభుత్వం నుంచి సాయం దక్కాలంటే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విపత్తు ప్రకటన చేయాల్సి ఉంటుంది.

ప్రస్తుతం డల్లాస్ నగరం అత్యవసర రిజర్వ్ నిధి కింద 35 మిలియన్ డాలర్ల నిధిని కలిగి ఉందని.ఆ ఫండ్ నుంచి 11.4 మిలియన్ డాలర్లను మరమ్మత్తుల కోసం వెచ్చించాలని భావిస్తున్నట్లుగా రీచ్ ప్రకటించారు.వచ్చే ఆర్ధిక సంవత్సరానికి ప్రకటించే బడ్జెట్‌లో ఈ మొత్తాన్ని భర్తీ చేయాలనుకుంటున్నట్లు ఆమె తెలిపారు.ఆర్ధిక మాంద్యం కబళించేందుకు సిద్ధంగా ఉందని.కానీ అది ఎప్పుడు వస్తుందనేది ఖచ్చితంగా చెప్పలేమని అయినప్పటికీ దానిని ఎదుర్కొనేందుకు తాము సిద్దంగా ఉన్నామన్నారు.అక్టోబర్ 21న గంటకు 140 కిలోమీటర్ల వేగంతో విరుచుకుపడిన టోర్నడో కారణంగా డల్లాస్‌లో భారీ భవనాలు నేలమట్టమవ్వగా.
వేలాది చెట్లు, విద్యుత్ స్తంభాలు కూలిపోయాయి.