స్ఫూర్తి సరే....చిత్తశుద్ధి ఉందా?

తెలుగు రాష్ర్టాల ముఖ్యమంత్రులకు విదేశీ మోజు ఎక్కువ.వారిని విదేశాలు ఆకర్షించినంతగా మన దేశంలోని నగరాలు ఆకర్షించడంలేదు.

 Dallas To Inspire Telangana-TeluguStop.com

తమ రాష్ర్టాలను ఏదో ఒక విదేశంలా (బాగా అభివృద్ధి చెందినవి) చేయాలని, నగరాలను విదేశీ నగరాలతో దీటుగా చేయాలని యమ కలలు కంటున్నారు.విదేశీ నగరాల జపం చేయకుండా రోజు గడవడంలేదు.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ గతంలో ఒకసారి హైదరాబాదును అమెరికాలోని డల్లాస్‌ నగరంలా మారుస్తానన్నారు.ఇప్పుడు ఆయన కుమారుడు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ కూడా అదే మాట మరోరకంగా చెప్పారు.

ప్రస్తుతం అమెరికాలో ఉన్న ఆయన డల్లాస్‌లో ఎన్‌ఆర్‌ఐలతో సమావేశమయ్యారు.హైదరాబాద్‌ను ప్రపంచంలోనే అద్భుత నగరంగా అభివృద్ధి చేయాలనుకుంటున్నామని, ఇందుకు డల్లాస్‌ నగరమే తమకు స్ఫూర్తి అని చెప్పారు.

ఒకదాని నుంచి స్ఫూర్తి పొందటం మంచిదే.అయితే స్ఫూర్తి పొందినంత మాత్రాన చాలదు.

విదేశీయుల్లో ఉండే చిత్తశుద్ధి, అవినీతిరహిత పాలన, పారర్శకత మొదలైనవన్నీ ఉండాలి.అవి మన దగ్గర లేవు.

హైదరాబాద్‌ చెత్త రోడ్లను, కంపుగొట్టే వీధులను చూస్తేనే మన నాయకులకు, అధికారులకు, ప్రజలకు ఉన్న చిత్తశుద్ధి ఎటువంటిదో అర్థమవుతుంది.ఇప్పటివరకు ప్లాస్టిక్‌ను నిషేధించగలిగామా? సర్కారు సొమ్ముతో ప్రచారం చేస్తున్నారుగాని అమలు చేయడంలో అలసత్వంగా ఉన్నారు.ఇది విదేశాల్లో కనబడదు.విదేశాల నుంచి స్ఫూర్తి పొందడంతో పాటు వారి నుంచి మంచిని కూడా నేర్చుకోవాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube