ఆలయంలో పెళ్లి చేసుకోవాలని మేళ తాళాలతో వెళితే, తీరా ఏమిజరిగిందంటే

ఈ రోజుల్లో కూడా కులం పేరుతో వివక్షకు గురయ్యే వారు ఉన్నారు అంటే అతిశయోక్తి కాదేమో.అంతా డిజిటల్ యుగం గా మారుతున్న ఈ కాలంలో కేవలం ఒక దళితుడు అన్న కారణంగా పెళ్లి చేసుకోవడానికి ఆలయానికి వచ్చిన ఒక యువకుడికి అవమానమే ఎదురైంది.

 Dalit Groom Allegedly To Entering Into Temple-TeluguStop.com

ఆలయంలో పెళ్లి బంధం తో ఒక కుటుంబాన్ని ఏర్పరచుకోవాలని భావించిన ఆ యువకుడి ఆశలు వివక్ష పేరుతో నీరుగారాయి.ఈ ఘటన మధ్యప్రదేశ్ బుర్హాన్ పూర్ లోని బీరోడా గ్రామంలో గురువారం చోటుచేసుకుంది.

సందీప్ గవాలే అనే యువకుడు తన వివాహాన్ని ఆలయంలో చేసుకునేందుకు ఏర్పాట్లు చేసుకున్నాడు.దీనికోసం ముందస్తుగా ఆ జిల్లా కలెక్టర్ అనుమతి కూడా తీసుకున్నాడు.

అయితే వివాహా సమయానికి పెళ్లి కుమారుడు తన కుటుంబ సభ్యులతో కలిసి మేళ తాళాలతో ఆలయం వద్దకు చేరుకున్నాడు.అప్పటికే ఆలయం గేట్లు మూసివేసి ఉండడం చూసి ఆశ్చర్యపోయాడు.

అయితే అక్కడ సిబ్బంది ని అడుగగా ఆలయ నిర్వాహకుల ఆదేశాల మేరకు ఆలయాన్ని మూసివేసినట్లు తెలిపారు.

Telugu Dalit Groom, Dalitgroom, Stopped Temple, Telugu Ups-

దేవాలయం ట్రస్టీల ఆదేశంతోనే తాము దళిత వరుడిని దేవాలయంలోకి ప్రవేశించకుండా ఆపి తాళం వేశామని ఆలయ నిర్వాహకులు చెబుతున్నారు.దళితుడినని తనను దేవాలయంలోకి రాకుండా అడ్డుకున్నారని, దీనిపై చర్యలు తీసుకోవాలని సందీప్ కలెక్టరుకు ఫిర్యాదు చేయడం తో కలెక్టర్ పోలీసులకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తుంది.దీనితో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరోపక్క దళిత వరుడు సందీప్ తో పాటు అతని కుటుంబ సభ్యులకు కూడా పోలీసులు రక్షణ కల్పిస్తున్నట్లు తెలుస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube