నాలుగేళ్లుగా బాత్రూంలోనే గడిపిన కుటుంబం..!

నాలుగేళ్లుగా బాత్రూమే ఇళ్లైంది ఓ కుటుంబానికి.గత పాలకులకు ఎన్నో సార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు.

 Family, Live, Toilets, 4years , Dalit Family Lives In Toilet-TeluguStop.com

బాత్రూంలో నివాసముంటూనే… చేసేదేమి లేక అదే ఇళ్లలా భావించి తన కూతురికి పెళ్లి చేశారు ఆ దంపతులు.ఇంత విచిత్రమైన ఘటన మధ్యప్రదేశ్ లో చోటు చేసుకుంది.

మధ్యప్రదేశ్ లోని టీకామ్ గడ్ జిల్లాలోని మోహన్ గడ్ ప్రాంతంలోని కేశవ్ గడ్ గ్రామపంచాయతీలో ఈ దారుణం సంభవించింది.గత నాలుగేళ్లుగా ఓ కుటుంబం బాత్రూంలో నివసిస్తున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

కేంద్రం అప్పట్లో పక్కా ఇళ్లు నిర్మిస్తామని చెప్పడంతో ఈ కుటుంబానికి ఇంతటి దుస్థితి ఏర్పడిందని స్థానికులు తెలుపుతున్నారు.

కేవశ్ గడ్ గ్రామానికి చెందిన అహీర్వార్ కు భార్య, నలుగురు పిల్లలున్నారు.

అయితే ఇతని కుటుంబం గత నాలుగేళ్లుగా బాత్రూంలోనే ఉంటే జీవనం సాగిస్తున్నారు.అప్పట్లో గ్రామంలో పేదలకు ఉచిత ఇళ్లు నిర్మిస్తామని కేంద్రం తెలుపడంతో ఉన్న ఇళ్లును కూల్చేసి ఇళ్లు వస్తుందనే నమ్మకంతో జీవిస్తున్నారు.

రోజూ అధికారుల చుట్టు తిరుగుతూ ఇళ్లు నిర్మాణం గురించి అడుగుతున్నారు.అయినా అధికారులు మారుతున్నారే తప్ప తమ సమస్యను ఏ అధికారి పట్టించుకోలేదని వారు వాపోయారు.

అహీర్వార్ భార్య పూలాదేవి మాట్లాడుతూ.కేంద్ర ప్రభుత్వ పథకమైన ప్రధాన మంత్రి ఆవాస్ యోజన ద్వారా అందరికి ఇళ్లు నిర్మిస్తామని అప్పటి బీజేపీ ప్రభుత్వం తెలిపిందని, ఉన్న గుడిసెను కూల్చుకుని, బాత్రూంలో నాలుగేళ్లుగా ఉంటున్నామని ఆమె అన్నారు.

అధికారులకు సమస్య గురించి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని వాపోయారు.

పెళ్లీడుకి వచ్చిన కూతురిని ఈ బాత్రూం ఇంటిలోనే పెళ్లి చేశామన్నారు.

అహీర్వార్ కుటుంబం తహసీల్దార్ కార్యాలయంలో ఫిర్యాదు చేయడంతో స్థానిక తహసీల్దార్ అభిజీత్ స్పందించి మీడియాకు సంప్రదించాడు.తహసీల్దార్ మాట్లాడుతూ.

వీరికి నాలుగేళ్లుగా ఇళ్లు లేదని, అయితే ఉజ్వల పథకం కింద విద్యుత్, గ్యాస్ కనెక్షన్ అందించడం జరిగిందన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube