ద‌ళిత బంధు ఆశావ‌హులకు సీఎం కేసీఆర్ చ‌ల్ల‌ని క‌బురు

తెలంగాణలో టీఆర్ఎస్ ప్ర‌భుత్వం ఇటీవ‌లే దళిత బంధు ప‌థ‌కాన్ని ప్ర‌వేశ‌పెట్టింది.దీంతో రాష్ట్రంలోని ద‌ళితులంతా ఈ ప‌థ‌కం త‌మ‌కూ వ‌ర్తింప‌చేయాల‌ని కోరుతున్నారు.

 Dalit Bandhu Scheme Extended For Four Mandals, Cm Kcr, Dalita Bandhu Scheme, Goo-TeluguStop.com

దీనిని గ్ర‌హించిన సీఎం కేసీఆర్ ద‌ళిత‌బంధు ఆశావ‌హుల‌కు మ‌రో తీపిక‌బురు చెప్పారు.దళిత బంధు పథకాన్ని మరో నాలుగు మండలాలకు విస్తరిస్తూ తెలంగాణ ప్ర‌భుత్వం నిర్ణయం తీసుకుంది.

ఇప్పటికే ఈ పథకాన్ని పైలట్ ప్రాజెక్టుగా హుజూరాబాద్‌లో అమలు చేస్తున్నారు.ఈ ప‌థ‌కం అమలులో ఎదురువుతున్న‌ లోతుపాతులు, దళితుల‌ మనోభావాలను, వారి మౌలిక అవసరాలను పూర్తి స్థాయిలో తెలుసుకోవాల‌ని సీఎం కేసీఆర్ భావించారు.

తెలంగాణ రాష్ట్రంలో దళిత శాసన సభ్యులు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లోని నాలుగు మండలాలను ఎంపిక చేసి, ఆ ప్రాంతంలో ఉన్న ద‌ళిత కుటుంబాలకు కూడా ఈ ప‌థ‌కాన్ని అమలు చేయాలని సీఎం నిర్ణయం తీసుకున్నారు.

Telugu @cm_kcr, Cm Kcr Delhi, Dalitbandhu, Mandals, Huzurabad, Pilot Project, Te

అయితే సీఎం ఢిల్లీ పర్యటన అనంత‌రం ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, కలెక్టర్లతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించనున్నారు.త‌రువాత ఆ నాలుగు మండలాల్లో టీఆర్ ప్ర‌త‌ష్టాత్మ‌కంగా భావిస్తున్న‌ దళితబంధు పథకాన్ని అమలు చేస్తార‌ని తెలుస్తోంది.కాగా దళిత బంధు అమలుకు టీఆర్‌ఎస్ ప్రభుత్వం రూ.500 కోట్ల నిధుల విడుదలకు జీవో విడుద‌ల చేసింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube