15 వ దలైలామాగా అనంతపురం జిల్లా పుట్టపర్తి విద్యార్థి

బౌద్ధ మతగురువు దలైలామా వారసుడి గా అనంతపురం జిల్లా విద్యార్థి ఎన్నికైనట్లు తెలుస్తుంది.తన వారసుడిగా చైనా మరో దలైలామా ని తయారు చేయొచ్చని, అయితే భారత్ కు చెందిన వ్యక్తే తన అసలు వారసుడు అంటూ ఇటీవల దలైలామా ప్రకటించిన సంగతి తెలిసిందే.

 Dalai Lama Announces His Successor-TeluguStop.com

అయితే ఆయన ప్రకటించిన ప్రకారమే 15 వ దలైలామా గా పుట్టపర్తి లోని సత్యసాయి ప్రాధమిక పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్న దావావంగ్జిని పేరును ప్రకటించారు.ఈ నేపథ్యంలో ఇటీవల సత్యసాయి ప్రాథమిక పాఠశాలకు వచ్చిన బౌద్ధ ప్రతినిధుల బృందం అధికార ఉత్తర్వుల ప్రతిని అందజేసి ఆ బాలుడిని తమతో తీసుకెళ్లినట్లు తెలుస్తుంది.

దావావంగ్డిని పశ్చిమ బెంగాల్ లోని డార్జిలింగ్ కు చెందిన బాలుడు.డార్జిలింగ్ కు చెందిన ప్రేమవంగ్డి, పంజూరాయ్‌ దంపతుల కుమారుడు.

అయితే వివిధ కోణాల్లో దావావంగ్డిని క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరమే దలైలామా తన తదుపరి దలైలామాగా ఆ బాలుడిని ఎంపిక చేసినట్లు తెలుస్తుంది.

15 వ దలైలామాగా అనంతపురం  జిల్లా

ఈ క్రమంలో ఆ బాలుడిని దలైలామాగా పంపేందుకు బౌద్ధ గురువులు తల్లిదండ్రులతో మాట్లాడి ఒప్పించినట్లు సమాచారం.ఈ నేపథ్యంలో ఇప్పుడు అధికార ఉత్తర్వుల ప్రతిని అందించి ఆ బాలుడుని తమతో తీసుకువెళ్లారు.అయితే ఇక ఇప్పుడు ఆ బాలుడు ను దలైలామా గా మార్చడం కోసం మైసూరు సమీపంలోని బైలుకుప్పే బౌద్ధరామంలో 15ఏళ్లపాటు శిక్షణ ఇవ్వనున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube