రోజు కూలీకి గట్టి ఝలక్ ఇచ్చిన ఐటీ అధికారులు  

Daily Wager Who Earns Rs 300 Gets I-t Notice To Pay Rs 1 Crore-babu Saheb Go To Police Station,daily Wager,it Officials,mumbai Ambavali Colony,one Crore Income Tax,pan Card Account Open

ఐటీ అధికారులు బాగా డబ్బు ఉన్నవారిపైనే తమ ఉక్కుపాదం మోపుతారు అన్న విషయం అందరికీ తెలిసిందే.కోట్ల కు కోట్లు సంపాదించి టాక్స్ కట్టకుండా తప్పుకుంటున్న వారి సంగతి ఏమోగానీ ఐటీ అధికారులు మాత్రం రోజు కూలీ చేసుకొనే వ్యక్తికి గట్టి ఝలక్ ఇచ్చారు.

Daily Wager Who Earns Rs 300 Gets I-T Notice To Pay 1 Crore-Babu Saheb Go Police Station Daily It Officials Mumbai Ambavali Colony One Crore Income Tax Pan Card Account Open

ముంబై లోని అంబివలి బస్తీ లో బాబు సాహెబ్ అనే దినసరి కూలీ గా జీవనం సాగిస్తుండగా,అతడికి కోటి రూపాయల ఇన్ కమ్ ట్యాక్స్ కట్టాలి అంటూ నోటీసులు అందాయి.రెక్కాడితే గాని డొక్కాడని సాహెబ్ లబో దిబో మంటూ పోలీసుల వద్దకు వెళ్ళాడు.

అసలు వివరాల్లోకి వెళితే….ముంబై లోని అంబలివలి బస్తీ లో బాబు సాహెబ్ అనే వ్యక్తి దినసరి కూలీగా జీవితం గడుపుతూ రోజుకు రూ.

300 రూపాయలు సంపాదిస్తున్నాడు.అయితే అతడికి ఐటీ శాఖ నుంచి ఒక్కసారిగా నోటీసులు అందాయి.

ఆ నోటీసులో కోటి రూపాయల సొమ్మును పన్నుతో పాటు అపరాధరుసుము కూడా కట్టాలి అంటూ నోటీసులల్లో పేర్కొన్నారు.దీనితో కంగారు పడిపోయిన సాహెబ్ పోలీసుల వద్దకు పరుగుపరుగున పోయి అసలు విషయం చెప్పాడు.

అయితే విచారణలో తేలిన అసలు విషయం ఏమిటంటే…2016లో డీమానిటైజేషన్ సమయంలో బాబు సాహెబ్ అకౌంట్లో గుర్తు తెలియని వ్యక్తులు రూ.58లక్షలు డిపాజిట్ చేసినట్లు తెలిసింది.అయితే ఈ విషయం అసలు తనకు తెలియదని పోలీసులతో మొరపెట్టుకుంటే ఐటీ ఆఫీసు లో అధికారులు బ్యాంకుకు వెళ్లి కనుక్కుంటే అతని పాన్ కార్డు మీద అకౌంట్ ఓపెన్ అయ్యిందని, అయితే అతడి స్థానం లో వేరే వ్యక్తి ఫొటో, ఫోర్జరీ సంతకాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు.ప్రస్తుతం కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

.

తాజా వార్తలు

Daily Wager Who Earns Rs 300 Gets I-t Notice To Pay Rs 1 Crore-babu Saheb Go To Police Station,daily Wager,it Officials,mumbai Ambavali Colony,one Crore Income Tax,pan Card Account Open Related....