మళ్లీ రాజకీయాలకు గుడ్‌ బై చెప్పనున్న ఎన్టీఆర్‌ అల్లుడు

ఏపీ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన వ్యక్తి దగ్గుబాటి వెంకటేశ్వరరావు.ఈయన ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చాలా కీలక వ్యక్తిగా వ్యవహరించాడు.

 Dagubati Venkateswa Rao Good Bye To Political Career-TeluguStop.com

చంద్రబాబు నాయుడు కంటే కూడా ఈయనే ఎక్కువగా మామ ఎన్టీఆర్‌ వద్ద సన్నిహిత్యంను కలిగి ఉండటంతో పాటు మంత్రులందరికి ఆదేశాలు ఇస్తూ ఉండేవాడు.అలాంటి దగ్గుబాటి వెంకటేశ్వరరావు తెలుగు దేశం పార్టీ చంద్రబాబు నాయుడు చేతిలోకి వెళ్లి పోయిన తర్వాత కనిపించకుండా పోయాడు.

ఎమ్మెల్యేగా మంత్రిగా చేసిన ఆయన చంద్రబాబు సీఎం అయిన తర్వాత రాజకీయాలకు గుడ్‌ బై చెప్పాడు.

దగ్గుబాటి వెంకటేశ్వరరావు భార్య పురందేశ్వరి మాత్రం కాంగ్రెస్‌లో ఎంటర్‌ అయ్యి రాజకీయాలు చేసింది.

ఎంపీగా ఎన్నిక అయ్యి కేంద్ర మంత్రిగా కూడా అయ్యింది.మారిన పరిస్థితుల నేపథ్యంలో ఆమె బీజేపీలో జాయిన్‌ అయ్యింది.

దగ్గుబాటి మొన్నటి ఎన్నికల్లో వైకాపా తరపున ఎమ్మెల్యేగా పోటీ చేశాడు.భార్య భర్తలు వేరు వేరు పార్టీలో ఉండటంను వైకాపా ఒప్పుకోవడం లేదు.

పురందేశ్వరిని వైకాపాలోకి తీసుకు రావాలంటూ దగ్గుబాటిపై ఒత్తిడి పెరిగింది.ఈ నేపథ్యంలో ఆయన సీరియస్‌ అయ్యాడు.

నేను ముఖ్యమంత్రిగా తప్ప అన్ని పదవులు చేశాను.నాకు రాజకీయాలపై పెద్దగా ఆసక్తి లేదంటూ తేల్చి చెప్పాడు.

ఆయన మాటలను బట్టి చూస్తుంటే భార్యను బీజేపీలోనే ఉంచనున్నాడని, ఆయనే వైకాపాకు రాజీనామా చేసి రాజకీయాల నుండి పూర్తిగా తప్పుకుంటాడని తెలుస్తోంది.తాను తప్పుకుని కొడుకుని బరిలోకి దించడం ఖాయంగా కనిపిస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube