దగ్గుపాటి దారెటు ? టీడీపీ వైపు చూస్తున్నారా ?

ఎన్టీఆర్ అల్లుడిగా రాజకీయాల్లో చక్రం తిప్పిన దగ్గుబాటి వెంకటేశ్వర రావు రాజకీయ జీవితం ఇప్పుడు ఇబ్బందుల్లో పడింది.ఆయన చేసిన చిన్న చిన్న వ్యూహాత్మక తప్పిదాల కారణంగా ఆయన రాజకీయ జీవితం కన్ఫ్యూజన్ లో పడింది.

 Daggubati Venkateswarao Which Party To Join-TeluguStop.com

మొన్నటి వరకు వైసీపీలో ఆయనకు బాగానే ప్రాధాన్యత దక్కింది.కానీ ఎన్నికల్లో ఓటమి చెందినప్పటి నుంచి ఆయనకు కష్టాలు మొదలయ్యాయి.

అదే సమయంలో ఆయన భార్య దగ్గుబాటి పురంధరేశ్వరి బీజేపీలోని ఉండడం, ఏపీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేస్తుండడం జగన్ కు ఆగ్రహం తెప్పించింది.అయితే భార్య, భర్తలు ఇద్దరు ఒకే పార్టీలో ఉండాలని, లేకపోతే మీ దారి మీరు చూసుకోవచ్చు అంటూ జగన్ సంకేతాలు ఇచ్చేసారు.

ప్రస్తుతం వెంకటేశ్వరావు బీజేపీలోకి వెళ్తారా లేక టిడిపిలోకి వెళ్తారా లేకపోతే మొత్తం రాజకీయాల్ని వదిలేస్తారా అనే చర్చ తీవ్రమవుతోంది.

Telugu Chandrababu Ntr, Chandrababutdp, Ntrnephew-

అది కాకుండా పర్చూరు నియోజకవర్గంలో ఎన్నికల ముందు వరకు ఇంఛార్జిగా ఉన్న రావి రామనాథం బాబు సీటు దక్కలేదనే కారణంతో తెలుగుదేశం పార్టీలోకి వెళ్లారు.అయితే దగ్గుబాటి వ్యవహారంలో ఆగ్రహంగా ఉన్న జగన్ మళ్లీ రామనాథం బాబును తీసుకువచ్చి స్వయంగా పార్టీ కండువా కప్పడంతో పాటు నియోజకవర్గ బాధ్యతలు అప్పగించారు.అయితే రామనాధం బాబు ని పార్టీలోకి తీసుకు వచ్చే విషయమై తనకు కనీసం సమాచారం ఇవ్వలేదని, దగ్గుపాటి అసంతృప్తిగా ఉన్నారు.

ఇక పురంధరేశ్వరి బిజెపిని వీడేందుకు ఎలాగూ సిద్ధంగా లేరు.ఆమెకు బీజేపీలో జాతీయ స్థాయిలో ఏదో ఒక పదవి దక్కుతుందనే ఆలోచనలో ఉన్నారు.ఈ నేపథ్యంలో ఆయన టిడిపిలోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది.దీనికి నందమూరి కుటుంబం ద్వారా ప్రయత్నాలు చేస్తున్నారట.

అయితే టీడీపీలోకి ఎంట్రీ ఇచ్చే విషయంలో బాబు దగ్గుపాటి రాకను ఇష్ట పడటం లేదట.

Telugu Chandrababu Ntr, Chandrababutdp, Ntrnephew-

ఇదే విషయమై దగ్గుపాటి ఇప్పటికే బాలకృష్ణ ద్వారా చంద్రబాబుకు చెప్పి చూసే ప్రయత్నం చేశారని, అయితే అందుకు చంద్రబాబు ససేమిరా అన్నట్టు సమాచారం.ఈ పరిస్థితుల్లో దగ్గుబాటి వెంకటేశ్వరావు కూడా ఆలోచనలో పడ్డాడట.ఎలాగూ పురంధరేశ్వరి బిజెపిని వదిలి ప్రాంతీయ పార్టీలోకి వచ్చేందుకు ఇష్టపడరు.

అదే కాకుండా ఆమెకు కేంద్రంలో ఏదో ఒక కీలక పదవి దక్కుతుంది కాబట్టి బిజెపికి శత్రువులుగా ఉన్న టీడీపీ, వైసీపీ లపై ఆమె విమర్శలు తప్పకుండా చేస్తారు.ఈ నేపథ్యంలో వైసీపీలో ఎదురైన అనుభవమే తనకు టీడీపీలను ఎదురయితే తన కథ మొదటికి వస్తుందని దగ్గుబాటి భావిస్తున్నారట.

అందుకే రాజకీయాలకు కొంతకాలం దూరంగా ఉండటమే బెటర్ ఆలోచనలు ఆయన ఉన్నట్టు తెలుస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube