దగ్గుబాటి అభిరామ్.. ఫస్ట్ ప్రాజెక్ట్ అప్డేట్!  

Daggubati Abhiram First Movie Updet-daggubati Suresh,rana,sri Reddy,victory Venkatesh

దగ్గుబాటి ఫ్యామిలీ నుంచి వెంకటేష్ – రానా మంచి హీరోలుగా కొనసాగుతున్నారు. అయితే అదే దారిలో వారసత్వాన్ని కొనసాగించేందుకు సురేష్ బాబు చిన్న కుమారుడు అభిరామ్ కూడా సిద్దమవుతున్నాడు. గత ఏడాది పలు వివాదాలతో ఆరోణలు ఎదుర్కొన్న అభి ఇప్పుడు పూర్తీ యాక్టర్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకోవడానికి ప్రిపేర్ అయ్యాడు..

దగ్గుబాటి అభిరామ్.. ఫస్ట్ ప్రాజెక్ట్ అప్డేట్!-Daggubati Abhiram First Movie Updet

అసలైతే గత రెండేళ్ల నుంచి అభిరామ్ ఫస్ట్ ప్రాజెక్ట్ పై సురేష్ బాబు చర్చలు జరుపుతున్నారు. పలువురు దర్శకులకు అడ్వాన్సులు ఇచ్చినట్లు కూడా వార్తలు వచ్చాయి.

అయితే ఫైనల్ గా భాను శంకర్ అనే దర్శకుడి స్క్రిప్ట్ ని ఫైనల్ చేసినట్లు టాక్ వచ్చింది. ఈ డైరెక్టర్ ఇంతకుముందు రాజు మహారాజు – సరదాగా అమ్మాయితో అనే రెండు సినిమాలను డైరెక్ట్ చేశాడు..

అయితే గత ఏడాది స్టార్ట్ కావాల్సిన భాను సినిమాకు పలు కారణాలతో సురేష్ బాబు ఎండ్ కార్డ్ పెట్టేశారు. ఇకపోతే ఇటీవల సురేష్ బాబు పాత ఆలోచనను మార్చుకొని మరికొన్ని ప్రేమ కథలను సెర్చ్ చేస్తున్నట్లు టాక్.

ప్రస్తుతం సురేష్ ప్రొడక్షన్స్ లో మూడు సినిమాలు సెట్స్ పై ఉన్నాయి. ఆ పనులన్నీ అయిపోగానే దగ్గుబాటి అభిరామ్ మొదటిసినిమాను స్టార్ట్ చేయాలనీ సురేష్ బాబు ప్లాన్ చేసుకున్నట్లు సమాచారం.