రానా రేంజ్ ఎంత పెరిగిందో తెలుసా ? అందుకే భీమ్లా నాయక్ కి అన్ని కోట్లు..

యంగ్ హీరో రానా దగ్గుబాటి రేంజ్బాహుబలిసినిమాతో అమాంతం పెరిగిపోయింది.టాలీవుడ్ టు బాలీవుడ్ ఎక్స్‌పరిమెంటల్ ప్రాజెక్ట్స్ చేస్తూ రానా తనకంటూ స్పెషల్ రికగ్నిషన్ ఏర్పరుచుకున్నారు.

 Daggubati Rana Remuneration For Bheemla Nayak-TeluguStop.com

రానా ప్రస్తుతం టాలీవుడ్ మోస్ట్ అవెయిటెడ్ మూవీ ‘భీమ్లానాయక్లో నెగెటివ్ రోల్ ప్లే చేస్తున్నాడు.మలయాళ సూపర్ హిట్ ఫిల్మ్ అయ్యప్పనుమ్ కోషియుమ్రీమేక్‌గా వస్తున్న ఈ చిత్రంలో రానా పాత్ర చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉండబోతుందని టాక్.

ఇక ఈ సినిమాలో నటించేందుకుగాను రానా భారీ రెమ్యునరేషన్ తీసుకున్నట్లు వార్త ఒకటి సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొండుతోంది. పి.డి.వి.ప్రసాద్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు.

 Daggubati Rana Remuneration For Bheemla Nayak-రానా రేంజ్ ఎంత పెరిగిందో తెలుసా అందుకే భీమ్లా నాయక్ కి అన్ని కోట్లు..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

సాగర్ కె.చంద్ర దర్శకత్వం వహిస్తుండగా, పవన్ ఫ్రెండ్ త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమాలకు మాటలు అందిస్తున్నార.చిత్రం నుంచి విడుదలైన ఫస్ట్ గ్లింప్స్ ‘భీమ్లానాయక్’ టైటిల్ సాంగ్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి.

కిన్నెరమెట్ల మొగలయ్య సాంగ్‌లో స్పెషల్ అప్పియరెన్స్ ఇచ్చారు.

రానా క్యారెక్టరైజేషన్ ఈ చిత్రంలో చాలా డిఫరెంట్‌గా ఉంటుందని ఫిల్మ్ నగర్ సర్కిల్స్‌లో టాక్ వినబడుతోంది.డానియల్ శేఖర్’గ రానా ఈ చిత్రంలో కనిపించనుండగా, బ్లిట్జ్ ఆఫ్ డానియల్ శేఖర్పేరిట మూవీ మేకర్స్ రానా పాత్రను పరిచయం చేసే వీడియో ఒకటి ఇటీవల విడుదల చేశారు.ఇందులో రానా డైలాగ్ డిక్షన్, డెలివరీ నెక్స్ట్ లెవల్‌లో ఉన్నాయి.

నెగెటివ్ రోల్‌లో రానా తన ప్రతిభను చూపించబోతున్నట్లు అర్థమవుతున్నది.

Telugu 4 Crors, Bheemla Nayak, Nithya Minon, Pawan Kalyan, Rana, Remunartion, Sagar Chandra, Tolywood-Telugu Stop Exclusive Top Stories

కాగా ఈ సినిమాలో 25 రోజుల కాల్‌షీట్‌కుగాను రానా రూ.నాలుగు కోట్లు తీసుకున్నట్లు తెలుస్తోంది.వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ చిత్రం విడుదల కానుంది.

పవన్‌కు జోడీగా క్యూట్ హీరోయిన్ నిత్యామీనన్ నటిస్తుండగా, రానా సరసన ఎవరు నటిస్తున్నారనేది ఇంకా అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రాలేదు.ఇకపోతే ఈ చిత్రానికి ఎస్.ఎస్.థమన్ మ్యూజిక్ అందిస్తున్నారు.చిత్రంలో పవన్ -రానా తలపడే సీన్స్ ఎక్సలెంట్‌గా ఉంటాయని తెలుస్తోంది.తెలుగు నేటివిటికీ తగ్గట్లు కథలో మార్పులుంటాయని సమాచారం.

#Bheemla Nayak #Pawan Kalyan #Crors #Tolywood #Nithya Minon

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు