టీడీపీలోకి పురంధేశ్వ‌రి.. రాజీ ఫ‌లించేనా?

ఏపీ రాజ‌కీయాల్లో నారా, ద‌గ్గుబాటి కుటుంబాల మ‌ధ్య విభేదాల గురించి అంద‌రికీ తెలిసిందే! ఎన్టీఆర్ హ‌యాంలో తలెత్తిన ఈ విభేదాలు నేటికీ కొన‌సాగుతూనే ఉన్నాయి.అయితే ప్ర‌స్తుతం ద‌గ్గుబాటి వెంక‌టేశ్వ‌ర‌రావు రాజ‌కీయాలకు దూర‌మ‌వ‌గా.

 Daggubati Purandeswari To Join Tdp ?-TeluguStop.com

ఆయ‌న స‌తీమ‌ణి పురంధేశ్వ‌రి మాత్రం బీజేపీలో ఉన్నారు.ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఏపీకి మిత్ర‌ప‌క్ష మ‌యినా.

నేటికీ ఆ పోరు కొన‌సాగిస్తున్నారు పురంధేశ్వ‌రి.ప్ర‌స్తుతం బీజేపీకి కూడా ఏపీలో ఆద‌ర‌ణ తగ్గిపోవ‌డంతో ఆమె.పార్టీ మారే యోచ‌న‌లో ఉన్నార‌ట‌.దీంతో ఆమెను తెదేపాలోకి తీసుకొచ్చందుకు సీనియ‌ర్ నాయ‌కుడు ముద్దు కృష్ణ‌మ‌నాయుడు ప్ర‌య‌త్నిస్తున్నార‌ట‌.

ఈ మేర‌కు బాబు-పురంధేశ్వ‌రి మ‌ధ్య రాజీ కుదిర్చేందుకు తీవ్రంగా శ్ర‌మిస్తున్నార‌ట‌.

తెలుగు రాష్ట్రాల్లో పాగావేయాల‌ని భావించిన బీజేపీ క‌లలు ఇప్ప‌ట్లో నెర‌వేరేలా కనిపించ‌డం లేదు.2014 ఎన్నిక‌ల్లో మోడీ మ్యానియాతోనూ టీడీపీ అండ‌తో విజ‌యం ద‌క్కించుకున్నా.ప్ర‌స్తుతం వాస్త‌వాలు ప్ర‌జ‌లు అర్థం చేసుకుంటున్నారు.

దీంతో బీజేపీని నేల చూపులు త‌ప్పేలా క‌నిపించడం లేదు.రెండేళ్ల‌లో ఎన్నిక‌లు ఉన్నాపార్టీలో ఉంటే సీటిచ్చినా.

గెలుపు క‌ష్ట‌మ‌నే భావ‌న‌కు వ‌స్తున్నారు నేత‌లు.దీంతో ఇక ఎవ‌రి దారి వారు చూసుకునే ప‌నిలో ప‌డ్డారు.

ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన దగ్గుబాటి పురంధేశ్వ‌రి కూడా ఇదే ఆలోచ‌న‌లో ఉన్నార‌ట‌.ముఖ్యంగా వైసీపీ, టీడీపీల్లో ఏ పార్టీలో చేరాల‌నే అంశంపై ఆమె ఆలోచిస్తున్నార‌ట‌.

విభ‌జ‌న త‌రువాత జ‌వ‌స‌త్వాలు కోల్పోయిన పార్టీలో ఇమ‌డ‌లేక‌నో లేక ఇప్ప‌ట్లో అధికారం రాద‌నే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ నేత‌లు వేరే పార్టీల్లోకి గోడ‌దూకారు.కాంగ్రెస్‌లో రాష్ట్ర మంత్రిగా క‌న్నా ల‌క్ష్మినారాయ‌ణ‌, కేంద్రంలో చ‌క్రం తిప్పిన మాజీ మంత్రి పురందేశ్వ‌రీ ఇద్ద‌రూ బీజేపీలోకి చేరారు.

ప్ర‌స్తుతం బీజేపీలోనూ వారు ఇమ‌డ‌లేక‌పోతున్నార‌నే ప్ర‌చారం జోరుగా వినిపిస్తోంది.వచ్చే ఎన్నిక‌ల్లో కాషాయం అంత‌గా ప్ర‌భావం చూపద‌ని ఇప్ప‌టికే ఒక నిర్ణ‌యానికి వ‌చ్చార‌ట‌.

దీంతో క‌న్నా ల‌క్ష్మినారాయ‌ణను వైసీపీలోకి ఆహ్వానించేందుకు బొత్స మ‌ధ్య‌వ‌ర్తిత్వం చేస్తున్నాడ‌ట‌.ఇక‌.మ‌రో నాయ‌కురాలు పురందేశ్వ‌రినీ టీడీపీలోకి ర‌ప్పించేందుకు ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణ‌మ‌నాయుడు మంత‌నాలు సాగిస్తున్న‌ట్లు స‌మాచారం.కుటుంబ విభేదాలు ప‌క్క‌న‌పెట్టి పార్టీలోకి రావాల‌ని ఆహ్వానిస్తున్నార‌ట‌.

మ‌రి అధికారం కోసం కుటుంబ విభేదాలు ప‌క్క‌న‌పెడ‌తారో లేదో వేచిచూడాల్పిందే!!

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube