ఇప్పట్లో పెళ్లి లేదట!

‘బాహుబలి’ సినిమా పూర్తి అయిన వెంటనే ప్రభాస్‌ మరియు రానాలు పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ గత కొన్నాళ్లుగా మీడియాలో ప్రచారం జరుగుతున్న విషయం తెల్సిందే.అయితే తాజాగా రానా తన పెళ్లి గురించి స్పందిస్తూ తాను ఇప్పట్లో పెళ్లి చేసుకోవాలని అనుకోవడం లేదు అంటూ ప్రకటించాడు.

 Daggubati Family Excited About Rana’s Marriage-TeluguStop.com

ప్రస్తుతం తన దృష్టి అంతా కూడా సినిమాలపైనే ఉందని, అరడజను సినిమాలకు పైగా తాను కమిట్‌ అయ్యాను అని ఆ సినిమాలు పూర్తి అయితే కాని పెళ్లి పీఠలు ఎక్కబోను అంటూ రానా చెప్పుకొచ్చాడు.

మరో వైపు రానా కుటుంబ సభ్యులు మాత్రం ఆయనకు పెళ్లి సంబంధాలు చూసి, త్వరగా పెళ్లి చేయాలని ఉవ్విల్లూరుతున్నారు.

కాని రానా మాత్రం రేపు ఎల్లుండి అంటూ తన పెళ్లిని వాయిదా వేస్తున్నాడు.కుటుంబ సభ్యులు రానా మనస్సులో ఎవరైనా ఉన్నారా అనే విషయాన్ని కూడా తెలుసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు.

ప్రస్తుతం రానా ‘బాహుబలి’ రెండవ పార్ట్‌లో నటిస్తున్నాడు.మరో వైపు తమిళంలో కూడా ఈయన రెండు సినిమాలు చేస్తున్నాడు.

హిందీ మరియు తెలుగులో కూడా ఈయన సినిమాలు అంగీకరించాడు.ఇలా సినిమాలతో బిజీగా ఉండటం వల్లే పెళ్లికి నో చెప్తున్నాడు మినహా ప్రేమ వ్యవహారం ఉండి ఉండదు అని ఆయన సన్నిహితులు అంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube