అభిరామ్ 'అహింస'లో విలన్ ఎవరంటే..!

దగ్గుబాటి ఫ్యామిలీ నుండి వస్తున్న మరో హీరో అభిరాం డెబ్యూ మూవీ తేజ డైరక్షన్ లో చేస్తున్న విషయం తెలిసిందే.సురేష్ ప్రొడక్షన్ బ్యానర్ లో సురేష్ బాబు నిర్మిస్తున్న ఈ సినిమాకు అహింస అనే టైటిల్ ఫిక్స్ చేసినట్టు తెలుస్తుంది.

 Daggubati Abhiram Ahimsa Villain Samuthirakhani, Ahimsa, Daggubati Abhiram, Dire-TeluguStop.com

ఈ సినిమాకు ఆర్పీ పట్నాయక్ మ్యూజిక్ అందిస్తున్నారు.తేజ, ఆర్పీ పట్నాయక్, చంద్రబోస్ ఈ కాంబోలో చాలా కాలం తర్వాత వస్తున్న ఈ సినిమాపై మ్యూజికల్ గా చాలా అంచనాలు ఉన్నాయి.

ఇక ఈ సినిమాలో విలన్ గా కోలీవుడ్ నటుడు సముద్రఖనిని ఫిక్స్ చేసినట్టు తెలుస్తుంది.

ఈమధ్య తెలుగులో సినిమాల్లో బాగా వినిపిస్తున్న పేరు సముద్రఖని.

అల వైకుంఠపురములో, క్రాక్ సినిమాల్లో విలన్ గా నటించిన సముద్రఖని సర్కారు వారి పాట, ఆర్.ఆర్.ఆర్ సినిమాల్లో కూడా ఛాన్స్ అందుకున్నాడు.ఇక ఇప్పుడు తేజ డైరక్షన్ లో వస్తున్న అహింస సినిమాలో కూడా సముద్రఖని నటిస్తున్నాడని తెలుస్తుంది.

Telugu Abhiram Latest, Ahimsa, Rp Patnayak, Samuthirakhani, Sarkaruvaari, Suresh

వరుస తెలుగు సినిమాలతో సముద్రఖని తెలుగులో సూపర్ క్రేజ్ తెచ్చుకునాడు.ఒకప్పుడు డైరక్టర్ గా మంచి సినిమాలు చేసిన సముద్రఖని తెలుగులో క్యారక్టర్ ఆర్టిస్ట్ గా రాణిస్తున్నాడు. తేజ సినిమాలో విలన్ గా అంటే మరోసారి సముద్రఖనికి మంచి రోల్ పడినట్టే అని చెప్పుకుంటున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube