దాదాసాహెబ్ అవార్డు అందుకున్న సీరియల్.. హీరోయిన్ కు కూడా?

Dadasaheb Phalke Award For Best Hindi Serial For Anupama

రూపాలి గంగూలి మొదట థియేటర్ ఆర్టిస్టుగా కెరీర్ ప్రారంభించిన ఈమె ఆ తరువాత స్టార్ ప్లస్ సీరియల్స్ తో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది.అంతే కాకుండా ఈమెకు ఇంస్టాగ్రామ్ లో పది లక్షలకు పైగా ఫాలోవర్లు ఉన్నారు.

 Dadasaheb Phalke Award For Best Hindi Serial For Anupama-TeluguStop.com

ఒకవైపు సీరియల్స్ లో నటిస్తూనే మరొకవైపు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది.ఈమె నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని తన అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది.

ఇది ఇలా ఉంటే బాలీవుడ్ టెలివిజన్ షో లలో అత్యంత ప్రజాదరణ పొందిన షో అనుపమ.ఈ షో నెలల తరబడి టిఆర్పిని రూల్ చేసింది.

 Dadasaheb Phalke Award For Best Hindi Serial For Anupama-దాదాసాహెబ్ అవార్డు అందుకున్న సీరియల్.. హీరోయిన్ కు కూడా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అనుపమ సీరియల్ లో రూపాలి గంగూలి లీడ్ రోల్ ను పోషించింది.కుటుంబం కోసం తన ఆశలు,ఆశయాలు త్యాగం చేసే ఒక మంచి గృహిణిగా,తల్లిగా పేరు తెచ్చుకునే క్యారెక్టర్ లో ఈమె జీవించింది.

ఈ పాత్రలో ఈమె నటించింది అనే బదులు జీవించింది అని చెప్పవచ్చు.

ఈ షో పై ప్రజల్లో అభిమానం ఎంతలా ఉంది అంటే షో లోని పలు పాత్రలు పేరు కొందరి ఇంటి పేరుగా కూడా మారాయి.రాజన్ షాహి నిర్మించిన ఈ షో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డులో ఉత్తమ హిందీ సీరియల్ అవార్డు గెలుచుకుంది.ఈ షోలో మెయిన్ రోల్లో నటించిన ప్రముఖ నటి రూపాలి గంగూలీకి ఉత్తమ ఫిమేల్ అవార్డు లభించింది.

అలాగే మరొక నటుడు సుధాన్షు పాండే అక వనరాజ్ ఉత్తమ మేల్ అవార్డును సొంతం చేసుకున్నాడు.ఒక సీరియల్ ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందుకోవడం ఎంతో గర్వించదగ్గ విషయం అని చెప్పవచ్చు.

#Rupali Ganguli #DadasahebPalke #Anupama

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube