ఆ పని చేసినందుకు నాన్న బెల్టుకు పని చెప్పారు.. చిన్నప్పటి విషయాలను గుర్తు చేసుకున్న నటి?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో నిన్నటి తరం హీరోయిన్లలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు నటి గీత.ఈమె ఒకప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో అగ్రతారగా స్టార్ హీరోలు అందరి సరసన నటించి మంచి గుర్తింపు పొందారు.

 Dad Told Beltu For Doing That An Actress Who Remembers Things From Her Childhoo-TeluguStop.com

ఇక ప్రస్తుతం ఈమె తల్లి పాత్రలలో నటిస్తూ ప్రేక్షకులను సందడి చేస్తున్నారు.ఇదిలా ఉండగా చాలా రోజుల తర్వాత ఈమె ఆలీతో సరదాగా అనే కార్యక్రమం ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

ఇలా ఆలీతో కలిసి ఎన్నో విషయాలను ముచ్చటించిన గీత తన చిన్నప్పటి విషయాలను కూడా గుర్తు చేసుకున్నారు.

ఈ క్రమంలోనే తాను చిన్నప్పుడు చేసిన ఒక చిన్న తప్పు వల్ల నాన్న తన బెల్టుకు పని చెప్పి బెల్టుతో బాగా చితక్కొట్టాడు అంటూ గుర్తు చేసుకున్నారు.

తాను నాలుగవ తరగతిలో చదువుతున్న సమయంలో స్కూల్ నుంచి ఇంటికి చాలా ఆలస్యంగా వచ్చాను స్నేహితులతో కలిసి జారు బండ ఆడుతూ ఇంటికి ఆలస్యంగా వచ్చాను.అయితే నాన్న ఆలస్యం ఎందుకు అని అడగ్గా జారుబండ ఆడుతూ ఉన్నానని చెప్పగా ఇలా చెప్పకుండా ఎక్కడికైనా వెళ్తావా అంటూ నాన్న బెల్టు తీసుకొని తనని చితకొట్టాడంటూ ఈ సందర్భంగా గీత చిన్నప్పటి విషయాలను గుర్తు చేసుకున్నారు.

Telugu Chiranjeevi, Githa, Githa Childhood-Movie

అలా నాన్న ఆరోజు కొట్టిన దెబ్బలకు ఇక తాను తన తల్లిదండ్రులకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళలేదని అయితే తాను ఎనిమిదవ తరగతి వరకు మాత్రమే చదువుకున్నానని ఈ సందర్భంగా ఈమె తెలియజేశారు.ఇక ఎన్నో సినిమాలలో అగ్ర హీరోలతో కలిసి నటించిన తనకి ప్రస్తుతం స్టార్ హీరోలకు తల్లి పాత్రలలో నటించే అవకాశాలు వస్తున్నాయని వెల్లడించారు.ఇక చిరంజీవి తనకు ఎంతో ఇష్టమైన హీరో ఇప్పటికి చిరంజీవితో కలిసి ఒక సినిమాలో అయినా నటించాలని ఉందంటూ ఈమె తన మనసులో ఉన్న కోరికను బయటపెట్టారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube