కేసీఆర్‌ దమ్మునే ప్రశ్నించిన డీఎస్‌  

D Srinivas Comments On Kcr-d Srinivas Congress,telangana Cm Kcr

టీఆర్‌ఎస్‌ రాజ్యసభ సభ్యుడు డి శ్రీనివాస్‌ ప్రస్తుతం ఏ పార్టీలో ఉన్నాడో కచ్చితంగా చెప్పలేని పరిస్థితి.ఆయన టీఆర్‌ఎస్‌ రాజ్యసభ సభ్యుడు కాగా ఆయన తనయుడు బీజేపీ పార్లమెంటు సభ్యుడు.

D Srinivas Comments On KCR-D Congress Telangana Cm Kcr

ఇక ఈమద్య కాలంలో డీఎస్‌ పదే పదే కాంగ్రెస్‌ జపం చేస్తూ వస్తున్నాడు.ఈ నేపథ్యంలో ఆయన ఏ పార్టీలో ఉన్నాడు, ఏ పార్టీలోకి వెళ్తాడు అనే చర్చ జరుగుతోంది.

ఇదే సమయంలో డీఎస్‌ను రాజ్యసభ కు రాజీనామా చేయాల్సిందిగా టీఆర్‌ఎస్‌ నాయకులు డిమాండ్‌ చేస్తున్నారు.

టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న డీఎస్‌ తమ పార్టీ ఇచ్చిన పదవిని పట్టుకుని వెలాడటం ఏంటీ అంటూ ప్రశ్నించాడు.

గత కొంత కాలంగా టీఆర్‌ఎస్‌కు దూరంగా ఉంటూ టీఆర్‌ఎస్‌లోనే ఉంటున్న డీఎస్‌ తాజాగా తనను దుమ్ముంటే సస్పెండ్‌ చేయాలంటూ కేసీఆర్‌కు సవాల్‌ విసిరాడు.కాని చాలా నెలలుగా డీఎస్‌ను సస్పెండ్‌ చేయాలంటూ ఆ పార్టీ నాయకులు డిమాండ్‌ చేస్తున్నా కూడా కేసీఆర్‌ మాత్రం ఆచి తూచి అడుగులు వేస్తున్నాడు.

డీఎస్‌ను పార్టీ నుండి సస్పెండ్‌ చేసేందుకు ఏదో కారణం వల్ల కేసీఆర్‌ ఆసక్తి చూపడం లేదు.అందుకే ఆయన కొనసాగుతూ వచ్చాడు.ఇప్పుడు ఏకంగా డీఎస్‌ సవాల్‌ చేయడంతో కేసీఆర్‌ ఎలా స్పందిస్తాడో చూడాలి.

తాజా వార్తలు