తుఫాన్ అప్డేట్స్ : పెరిగిన చలి.... తొమ్మిది మంది మృతి

పెథాయ్ ఎఫెక్ట్ కారణంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో చలి విపరీతంగా పెరిగిపోయింది.ముఖ్యంగా… తుఫాన్ ఎఫెక్ట్ ఎక్కువగా ఉన్న కోస్తా తీరంలో పగలు రాత్రి అనే తేడా లేకుండా చలి పంజా విసురుతోంది.విపరీతంగా పెరిగిన చలిగాలుల కారణంగా ….ఇప్పటికే 9 మంది మృతిచెందారు.ఏపీలో 8 మంది, తెలంగాణ ఒకరు మృతి చెందారు.మృతి చెందిన వారి వివరాలు ఒకసారి పరిశీలిస్తే….

 Cyclon Effect Nine People Daied In Ap Telangana States-TeluguStop.com

పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం మండలం పెదమైనవానిలంకలో వృద్ధురాలు మృతి చెందింది.మొగల్తూరు మండలం కొత్తకాయలతిప్పలో వృద్ధురాలు కృష్ణమ్మ మృత్యువాత పడింది.ప్రకాశం జిల్లా చీరాల ఐక్యనగర్‌లో చలిగాలులకు ఇద్దరు వృద్ధులు మృతి చెందారు.మృతులను వెంకయ్య(73), నూనె కుమారి(61)గా గుర్తించారు.ప్రకాశం జిల్లా వేటపాలెం బస్ షెల్టర్‌లో చలిగాలులకు వృద్ధుడు, విశాఖ జిల్లా హుకుంపేట మండలం దాలిగుమ్మడిలో చలిగాలులకు ఒక వ్యక్తి మృతి చెందారు.తూర్పుగోదావరి జిల్లా కాజులూరు మండలం పల్లిపాలెంలో వృద్ధురాలు మృతి చెందింది.

ఉప్పలగుప్తం మండలం భీమనపల్లిలో రంగయ్య(70)మృతి మృతి చెందాడు.ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం కొమ్ముగూడెంలో కాశీ (55) మృత్యువాత పడ్డారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube