అమెరికాలో “చెట్టు సైకిల్” చరిత్ర తెలుసా...

అంతుబట్టని విషయాలు ప్రపంచంలో ఎన్నో ఉంటాయి.వాటి గురించి ఎంతగా ఆలోచించినా బుర్రలు బద్దలు కొట్టుకున్నా సరే అసలు విషయం తెలియదు.

 Cycle Tree In America-TeluguStop.com

అంతేకాదు అలాంటి విషయాల గురించి కుప్పలు తెప్పలుగా రకరకాల కధనాలు ప్రాచుర్యంలోకి వస్తాయి.ఇప్పుడు అమెరికాలో ఇలాంటి ఘటనే చోటు చేసుకుని.

ఈ ఘటన ఎలా జరిగిందో అంటూ అందరూ జుట్లు పీక్కుంటున్నారట.

అమెరికాలోని వాషన్ ఐల్యాండ్ లో సైకిల్ ట్రీ అనే చెట్టు ఉంది.

ఈ చెట్టు యొక్క ప్రాముఖ్యత ఏమిటంటే.ఒక సైకిల్ చెట్టు మధ్యలో ఎవరో పెట్టినట్టుగా చెట్టులోపలి అతుక్కుని పోయి ఉంటుంది.

అంత పెద్ద చెట్టు కాండం మధ్యలో ఈ సైకిల్ ఎలా వెళ్లిందనేది ఇప్పటి వరకూ ఎవరికీ అంతుబట్టని రహస్యంగా మిలిగి పోయింది.ఆ సైకిల్ ఎవరిదీ, అక్కడికి ఎలా వచ్చింది అనే ప్రశ్నలు అందరిని ఆలోచింప చేస్తున్నాయి.

ఇదిలాఉంటే ఈ సైకిల్ ట్రీ విషయంలో ఓ కధ స్థానికంగా వినిపిస్తూ ఉంటుంది.ఈ ప్రాంతంలో ఒక చిన్న కుర్రాడు ఉండేవాడట.అతడు ఒకానొక సమయంలో యుద్ధంలో పాల్గొన వలసి వచ్చిందని, ఈ క్రమంలోనే తన సైకిల్ ని అప్పట్లో ఈ చెట్టుకు కట్టి వెళ్లిపోయాడని, అతడు తరువాత ఆ ప్రాంతానికి రాకపోవడంతో ఈ చెట్టుతో పాటు సైకిల్ కాండంలోకి వెళ్లి ఎదుగుతూ ఉండిపోయిందని అంటుంటారు.ఏది ఏమైనా ఈ సైకిల్ ట్రీ ఆప్రాంతంలో బాగా ఫేమస్ అయ్యిపోయింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube