గ్రేట్‌ : సైకిల్‌ మెకానిక్‌కు పద్మ అవార్డు, షరీఫ్‌ చాచా చేసిన సేవ ఏంటో తెలుసా?

ప్రతి రిపబ్లిక్‌డేకు కేంద్ర ప్రభుత్వం ప్రముఖులకు, సంఘ సంస్కర్తలకు మరియు సామాజిక వేత్తలకు ఆయా రంగాల్లో విశేష ప్రతిభ కనబర్చిన వారికి పద్మ అవార్డులను ఇవ్వడం ఆనవాయితిగా వస్తుంది.పద్మ అవార్డులు అందుకునే వారిలో అతి సామాన్యులు కూడా ఎంతో మంది ఉంటున్నారు.

 Cycle Mechanic Sharif Chacha Get Padmasri Award For His Social Service-TeluguStop.com

గతంలో ఒక వృద్ద ముసలి మహిళకు చెట్లు పెంచుతుందనే ఉద్దేశ్యంతో పద్మ అవార్డు ఇచ్చి ఆమె గొప్పతనంను ప్రపంచానికి చాటి చెప్పడం జరిగింది.ఇప్పుడు మరో విభిన్నమైన వ్యక్తికి పద్మ అవార్డు ఇవ్వడంతో ఆవ్యక్తి గురించి తెలుసుకునేందుకు అంతా ఆసక్తి చూపుతున్నారు.

ఆయన షరీఫ్‌ చాచా.

Telugu Babri Mazidh, Cycle Mechanic, Cyclemechanic, Republicday, Traditional, Ch

సైకిల్‌ షాపు నిర్వహించే షరీఫ్‌ చాచా 27 ఏళ్లలో దాదాపుగా 25 వేల అనాధ శవాలకు దహన సంస్కారాలు చేయడం జరిగింది.అనాధ శవాలను అలా వదిలి వేయకుండా సాంప్రదాయ బద్దంగా దహన సంస్కారాలు చేయడంతో పాటు, వారికి సంబంధించి స్వర్గలోకం ప్రాప్తించేందుకు పిండ ప్రథానం కూడా చేయిస్తూ ఉంటాడు.ముస్లీం అయిన షరీఫ్‌ చాచా హిందూ సాంప్రదాయం ప్రకారమే ఈ దహన సంస్కారాలు నిర్వహిస్తూ ఉంటాడు.

రోజులో అయిదు పది అనాధ శవాలకు కూడా దహన సంస్కారాలు చేసిన ఘనత షరీఫ్‌ చాచాకు దక్కుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.

Telugu Babri Mazidh, Cycle Mechanic, Cyclemechanic, Republicday, Traditional, Ch

ఉత్తర ప్రదేశ్‌కు చెందిన షరీఫ్‌ ఇప్పటికి కూడా సైకిల్‌ రిపేరింగ్‌ షాప్‌ను నిర్వహిస్తూ టైర్లకు పంక్చర్స్‌ వేసుకుంటూ ఉంటాడు.తనకు వచ్చిన ఆదాయం నుండి కొద్ది మొత్తంను మరియు దాతలు ఇచ్చిన విరాళాలతో షరీఫ్‌ చాచా ఈ పని చేస్తున్నట్లుగా స్థానికులు చెబుతున్నారు.25 వేల మందికి దహన సంస్కారాలు నిర్వహించిన షరీఫ్‌ ఖచ్చితంగా పద్మశ్రీ అవార్డుకు అర్హుడే అంటూ ఉత్తర ప్రదేశ్‌లో ఆయన గురించి తెలిసిన వారు ఎంతో మంది అంటూ ఉన్నారు.

వారంలో మూడు నాలుగు రోజుల పాటు ప్రభుత్వ హాస్పిటల్స్‌ మరియు రోడ్లు, రైల్వే స్టేషన్స్‌ వెంట తిరుగుతూ అనాధ శవాలను గుర్తిస్తూ ఉంటాడు.ఎక్కడైనా యాక్సిడెంట్‌ అయినా కూడా వెంటనే షరీఫ్‌ చాచాకు ఫోన్‌ వెళ్తుంది.

మూడు రోజుల నుండి వారం రోజుల వరకు చూసి శవాన్ని గురించి ఎవరు రాకుంటే ఆ శవాన్ని షరీఫ్‌ చాచాకు పోలీసులు అప్పగిస్తూ ఉంటారు.ఆ శవానికి షరీప్‌ దహన సంస్కారాలు చేయిస్తూ ఉంటాడు.

Telugu Babri Mazidh, Cycle Mechanic, Cyclemechanic, Republicday, Traditional, Ch

28 ఏళ్ల క్రితం బాబ్రీ మసీదు అల్లర్లలో షరీఫ్‌ చాచా కొడుకు చనిపోయాడు.కొడుకు శవం దాదాపు నెల రోజుల తర్వాత కుల్లిపోయిన స్థితిలో షరీఫ్‌ చాచాకు లభించింది.దాంతో అప్పటి నుండి అనాధ శవాలను వెంటనే దహన సంస్కారాలు చేయాలని షరీఫ్‌ నిర్ణయించుకున్నాడు.కొడుకు శవంకు పట్టిన గతి మరే అనాధ శవంకు పట్టవద్దనే ఉద్దేశ్యంతోనే షరీఫ్‌ చాచా ఈ పని చేస్తున్నాడు.

అందుకే ఆయన సేవకు గుర్తించిన కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube