నారప్పను అలా వాడేసిన సైబరాబాద్ పోలీసులు.. ఏం జరిగిందంటే..?

ఈ నెల 20వ తేదీన అమెజాన్ ప్రైమ్ లో విడుదలైన నారప్ప పాజిటివ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.ప్రైమ్ లో ఈ సినిమాకు భారీ సంఖ్యలో వ్యూస్ వస్తున్నాయని తెలుస్తోంది.

 Cyberabad Traffic Police Using Narappa Movie Poster Corona Awareness-TeluguStop.com

సైబరాబాద్ పోలీసులు సోషల్ మీడియా ద్వారా ప్రజలకు నిరంతరం ట్రాఫిక్ రూల్స్ గురించి అవగాహన ప్రయత్నించే ప్రయత్నం చేస్తున్న సంగతి తెలిసిందే.ఇందుకోసం స్టార్స్ ఫోటోలను ట్రాఫిక్ పోలీసులు వినియోగిస్తున్నారు.

కరోనా విజృంభణ తగ్గినప్పటికీ కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతూ ఉండటంతో ట్రాఫిక్ పోలీసులు ప్రజలకు కరోనా గురించి అవగాహన కల్పించే ప్రయత్నాలు చేస్తుండటం గమనార్హం.మాస్కులు ధరిస్తే ప్రజలు కరోనా బారిన పడే అవకాశాలు తగ్గుతాయి.

 Cyberabad Traffic Police Using Narappa Movie Poster Corona Awareness-నారప్పను అలా వాడేసిన సైబరాబాద్ పోలీసులు.. ఏం జరిగిందంటే..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

సైబరాబాద్ పోలీసులు తాజాగా నారప్ప సినిమాలోని డైలాగ్ ను వాడేశారు.కరోనాపై ప్రజలకు అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో నారప్పలో వెంకటేష్ పోస్టర్ కు మాస్క్ ను తగిలించారు.

“ఒక విషయం చెబుతా బాగా గుర్తు పెట్టుకో సిన్నప్ప మాస్క్ పెట్టుకో సిన్నప్ప, కరోనా ఇంకా ముగిసిపోలేదు” అని సైబరాబాద్ పోలీసులు చేసిన మీమ్ నెటిజన్లను ఆకట్టుకుంది.ఈ మీమ్ నెట్టింట తెగ వైరల్ అవుతుండటం గమనార్హం.సైబరాబాద్ పోలీసుల క్రియేటివిటీని నెటిజన్లుమెచ్చుకుంటూ ఉండటం గమనార్హం.గతంలో కూడా సైబరాబాద్ పోలీసులు షేర్ చేసిన మీమ్స్ తెగ వైరల్ అయ్యాయి.

మరోవైపు నారప్ప మూవీ థియేటర్లలో విడుదలై ఉంటే బాగుండేదని వెంకటేష్ ఫ్యాన్స్ భావిస్తున్నారు.త్వరలో తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు ఓపెన్ కానున్న నేపథ్యంలో ఈ సినిమాను థియేటర్లలో కూడా రిలీజ్ చేస్తారో లేదో చూడాల్సి ఉంది.

#Comments #Narappa Meme #Corona #Narappa Meme #Poster

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు