బోల్తా కొట్టింది లే బుల్ బుల్ పిట్ట.. అంటున్న సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు..!

దేశంలో ప్రధాన నగరాల్లో ట్రాఫిక్ పోలీసుల కంటే హైదరాబాద్ పోలీసులు చాలా షార్ప్ అన్న విషయం అందరికి తెలిసిందే.ట్రాఫిక్ రూల్స్ సరిగా పాటించకపోయినా, అలాగే పోలీసులకు దొరకకుండా తెలివిగా తప్పించుకునే ప్రయత్నాలు చేసిన సరే హైదరాబాద్ పోలీసులు ఇట్లే వాహనదారులను పట్టుకుంటున్నారు.

 Cyberabad Traffic Police New Challan On Number Plate, Vehicles, Number Plates,-TeluguStop.com

ఇకపోతే ట్రాఫిక్ రూల్స్ సరిగా పాటించకుండా అలాగే పోలీసులకు దొరకకుండా ఉండేందుకు ప్రయత్నాలు చేసే వారికి సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు అధికారులు తాజాగా ఓ షాక్ ఇచ్చారు.ఇక నుండి ఎవరైనా సరే చలానాలు నుండి తప్పించుకోవడానికి నెంబర్ ప్లేట్ పై నెంబర్ కనపడకుండా ఉంచేందుకు ఏదైనా అడ్డు పెట్టినట్లయితే వారికి కొత్త రూల్స్ తీసుకోవచ్చారు.

ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.

హైదరాబాదులోని వాహనదారుల నెంబర్ ప్లేట్ సరిగా లేకపోయినా అలాగే పూర్తిగా కనపడకుండా చేసిన అలాంటివారికి.

ముందుగా నెంబర్ ప్లేట్ సరిగా లేని ద్విచక్ర వాహనాలకు 200 రూపాయలు, అలాగే కావాలనే ఉద్దేశ్యపూర్వకంగా బండి వివరాలను దాచాలనే ప్రయత్నం చేసేవారికి 500 రూపాయలు ఫైన్ విధించబడుతుంది అని పోలీసులు తెలిపారు.ఈ విషయాన్ని తెలపడానికి సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు మరోసారి వారి క్రియేటివిటీని చూపించారు.అదేంటంటే.

” అనుకున్నది ఒక్కటి, అయినది ఒక్కటి బోల్తా కొట్టిందిలే బుల్ బుల్ పిట్ట” అంటూ తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా వివరాలను చూపిస్తూ ఓ పోస్ట్ ను చేసింది.అయితే ట్రాఫిక్ పోలీస్ అయినా సరే.వారికి కూడా నెటిజెన్స్ తమదైన శైలిలో కామెంట్స్ కురిపిస్తున్నారు.ఇందులో భాగంగానే కొందరు హైదరాబాద్ పోలీసుల ఉద్దేశించి.” హైదరాబాద్ పోలీసుల నుంచి తప్పించుకోవడం కష్టం కాదు.అసాధ్యం.అంటూ, ఇది మోసం.అలాంటి వాళ్లను జైల్లో వేయాలి, నగర పౌరులకు చలనాలు విధించే డ్యూటీ లో మీకు మీరే సాటి సార్” అంటూ నెంబర్ ప్లేట్ కు చున్నీలు కట్టిన ఇకపై ఎలాంటి లాభం ఉండదు అంటూ కామెంట్ల రూపంలో పెద్ద ఎత్తున స్పందన లభిస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube