జొమాటో కంపెనీకు ట్వీట్ పంచ్ వేసిన సైబరాబాద్ పోలీసులు...!

హైదరాబాద్ మహానగరంలో ట్రాఫిక్ నిబంధనలు ఎంత కఠినంగా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.అయినా గాని మన వారు చాలామంది ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేస్తూ ఇష్టమొచ్చినట్లు రోడ్లపై ప్రయాణిస్తున్నారు.

 Cyberabad Traffic Police Tweets To Zomato Delivery Boy Traffic Rules, Delivery B-TeluguStop.com

అయితే తాజాగా సైబరాబాద్ పోలీసులు వేసిన పంచ్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతుంది.వైరల్ గా మారడమే కాదు అందరిని ఆకర్షిస్తుంది.

చిన్న చిన్న పదాలను వెతికి మరీ ట్వీట్ పెడుతున్నట్లుగా అర్థం అవుతోంది.

తాజాగా సైబరాబాద్ పోలీసులు సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియో కు నెటిజన్స్ నుండి భారీ స్పందన లభిస్తోంది.

ఇక ఆ వీడియో సంగతి విషయానికి వస్తే ఓ జోమటో ఫుడ్ డెలివరీ బాయ్ ఇష్టారాజ్యంగా ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించి బైక్ నడుపుతున్న నేపథ్యంలో ఈ సంఘటన చోటు చేసుకుంది.ఇందుకు సంబంధించి న వీడియోను ట్విట్టర్ ఖాతా ద్వారా పోస్ట్ చేస్తూ ఒక పంచ్ విసిరారు.

ఆ వీడియోలో సదరు జొమాటో బాయ్ చేసిన తప్పును కళ్లకు కట్టినట్టుగా చూపుతూ అందుకు సంబంధించిన వీడియో సైతంను అటాచ్ చేశారు.ఎలాంటి ట్రాఫిక్ నిబంధనలు పాటించకుండా ఇష్టమొచ్చినట్టుగా వాహనాన్ని తోలుతూ పక్కనున్న వాహనదారులకు ఇబ్బంది కలిగిస్తూ అడ్డదిడ్డంగా యూ టర్న్ తీసుకుంటున్న విధానాన్ని సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు తప్పుపట్టారు.

దీంతో వారు ట్విట్టర్ వేదికగా ‘ డియర్ జొమాటో… మీ ఎగ్జిక్యూటివ్ లకు మీరు ఇదే నేర్పిస్తున్నారా ‘ అంటూ ట్వీట్ చేసింది.నగరంలోని హైటెక్ సిటీ ప్రాంతంలో ఉన్న సైబర్ టవర్ సిగ్నల్ దగ్గర ఈ సంఘటన చోటు చేసుకుంది.

అయితే ఈ వీడియో కి సంబంధించి నెటిజన్స్ నుండి మంచి స్పందన లభిస్తోంది.ఇలాంటి వారిపై తగు చర్యలు తీసుకోవాలని నెటిజన్స్ పోలీసులను కోరుతున్నారు.

మరికొందరు హైదరాబాద్ పోలీసుల పనితీరును మెచ్చుకోవడమే కాకుండా వారు వేసిన పంచ్ తెగ పొగిడేస్తూ రీ ట్వీట్స్ ను చేస్తున్నారు

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube