కరోనా ప్రచారం కోసం మహేష్ బిజినెస్ మెన్ ని వాడేసిన పోలీసులు

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ ప్రభావం ఎక్కువగా ఉంది.కరోనా మొదటిసారి వచ్చినప్పుడు ఇండియాలో లాక్ డౌన్ పెట్టడం వలన అంత ప్రభావం చూపించలేదు.

 Cyberabad Police Use Mahesh Babu Dialogues For Corona Awareness, Corona Pandemic-TeluguStop.com

ఇతర దేశాలలో లక్షలాది కేసులు నమోదై లక్షలాది మంది చనిపోయిన ఇండియా అంత తీవ్రతని పేస్ చేయలేదు.అయితే కరోనా సెకండ్ వేవ్ లో న్యూ వేరియంట్ కరోనా వైరస్ ఇండియాలో విశ్వరూపం చూపిస్తుంది.

రోజుకి లక్షలాది కేసులు నమోదు అవుతున్నాయి.వేల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు.

ముఖ్యంగా ఆక్సిజన్ అందక వందలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు.ప్రస్తుతం పరిస్థితి చాలా విషాదకరంగా ఉంది.

ఇక తెలుగు రాష్ట్రాలలో కరోనా సెకండ్ ప్రభావం ప్రస్తుతానికి కొంత తక్కువగా కనిపిస్తున్న రానున్న రెండు నెలల్లో కేసులు పెరిగే ప్రమాదం ఉందని అంటున్నారు.ఈ నేపధ్యంలో ఇప్పటి నుంచి రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తం అయ్యాయి.

కరోనా నిబంధనలు కఠినతరం చేశాయి.మరో వైపు కరోనా వాక్సిన్ కూడా వీలైనంత వేగంగా, వీలైనంత ఎక్కువ మంది వేసే ప్రయత్నం చేస్తున్నాయి.మాస్క్, భౌతిక దూరం తప్పనిసరి చేసింది.అలాగే నైట్ కర్ఫ్యూ విధించారు.

ఇదిలా ఉంటే కరోనా ప్రచారానికి తెలంగాణ పోలీసులు సెలబ్రిటీలని వాడుకుంటున్నారు.వారి ద్వారా కరోనాపై ప్రజలకి సూచనలు అందిస్తున్నారు.

ఈ కరోనా అవగాహనలో సెలబ్రిటీలు కూడా పోలీసులతో భాగం అవుతున్నారు.మరో వైపు సినిమాలలో డైలాగ్స్ ని కూడా పోలీసులు సోషల్ మీడియాలో తమ స్టైల్ లో కరోనాపై జాగ్రత్తలు తెలియజేయడం కోసం వాడుకుంటున్నారు.

సూపర్ స్టార్ మహేష్ బాబు బిజినెస్ మెన్ సినిమాలోని బీ ఎలర్ట్.ప్రొటక్ట్ యువర్ సెల్ఫ్ అనే డైలాగ్ ని తెలంగాణ పోలీసులు హైలైట్ చేస్తూ వేర్ మాస్క్.

మాస్క్ ఈజ్ మస్ట్ అనే హ్యాష్ ట్యాగ్స్ తో జనంలో ప్రచారం మొదలు పెట్టారు.ఈ ప్రయత్నం అందరినీ ఆకర్షిస్తోంది.

మాస్క్ ఆవశ్యకతను ఇలా స్టార్ హీరో డైలాగ్ రూపకంగా చెప్పడంతో మంచి స్పందన వస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube