సైబరాబాద్ కమిషనర్ స్టిపెన్ రవీంద్ర మాట్లాడుతూ.సైబరాబాద్ పరిధిలో గంజాయి ముఠా గుట్టు రట్టు.
అంతర్రాష్ట్ర గంజాయి ముఠాను సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు.మొత్తం ఎనిమిది మంది గంజాయి ముఠా సభ్యులు ఉన్నారు.
వివిధ రాష్ట్రాలకు చెందిన ఆరుగురునీ అరెస్ట్ చేసాము.మరో ఇద్దరు ప్రధాన నిందితులు వికాస్ జాధవ్, సుభాష్ కుమార్ లు పరారీలో ఉన్నారు.
ఈ ముఠా నుంచి 800 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నాము.పట్టుబడిన గాంజా విలువ సుమారు రూ.1.80 కోట్లు ఉంటుంది.
శంషాబాద్ ఎస్వోటీ, మియాపూర్ పోలీసులు సంయుక్త ఆపరేషన్ నిర్వహించారు.గంజాయి తరలిస్తున్న వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.ఒడిశా కొరపుట్ నుంచి మహారాష్ట్ర నాసిక్ కు గంజాయి ను తరలిస్తుండగా సైబరాబాద్ లో పట్టుకున్న పోలీసులు.ఈజీ మణి కోసం గంజాయ్ దందా చేస్తున్న ముఠా సభ్యులు.
మూటలో ప్రధాన నిందితుడు వికాస్ జాధవ్. ముఠా సభ్యులు ఒక కేజీ గంజాయిని 3 వేలకు కొనుగోలు చేసి 20 వేలకు అమ్ముతున్న గ్యాంగ్.
పక్కా సమాచారం తో ముఠాను అరెస్ట్ చేశాం.సైబరాబాద్ పరిధిలో 2021 మరియు 2022 జనవరి 20వ తేదీ వరకు మొత్తం 222 డ్రగ్స్ కేసులు నమోదు చేసి 459 మందిని అరెస్ట్ చేశాము.
రిపిటేడ్ గా డ్రగ్స్ దందా చేస్తున్న 25 మందిపై పిడి యాక్ట్ నమోదు చేశాము.