నెటిజన్లను ఆకట్టుకుంటున్న సైబరాబాద్ పోలీసుల ట్వీట్..

సైబరాబాద్ పోలీసులు ఎప్పటికప్పుడు ట్విట్టర్ లో పోస్టులు పెడుతూ జనాలకు సూచనలు చేస్తూ ఉంటారు.వారి దగ్గరకు వచ్చిన కేసులకు సంభందించిన వివరాలను ఎప్పటికప్పుడు ట్వీట్ చేస్తూ ప్రజలను అలెర్ట్ చేస్తూ ఉంటారు.

 Cyberabad Police Alerted Citizens About Fraud Links,cyberabad Police, Tweet, Onl-TeluguStop.com

తాజాగా సైబరాబాద్ పోలీసులు చేసిన ఒక ట్వీట్ నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటుంది.అంతేకాదు తెలియక మోసపోయే ప్రజలకు ఒక మంచి సందేశం అందించారు.

హైదరాబాద్ లో ఇలాంటి కేసులు రోజురోజుకూ పెరిగి పోతున్నాయి.ఎన్ని ప్రకటనలు చేసిన కొంతమంది ప్రజలు మోసపోతూనే ఉన్నారు.చివరకు మాకు న్యాయం చేయమంటూ పోలీసుల చుట్టూ తిరుగుతున్నారు.గిఫ్ట్స్, లక్కీ డ్రా వంటి మెసేజ్ లుకానీ.

కాల్స్ కానీ వస్తే అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.

సోషల్ మీడియాలో ఈ మధ్య డీమార్ట్, టాటా కంపెనీ, మహీంద్రా హాలిడే, యూరో లాటరీ వంటి పాపులర్ పేర్లతో కొన్ని లింక్స్ షేర్ చేస్తూ ప్రజలను నమ్మించి ఖాతాలలో ఉండే డబ్బును మాయం చేస్తున్నారు.

ఇలాంటివి కనిపిస్తే క్లిక్ చేయవద్దని.బ్యాంకు ఖాతాల వివరాలు కానీ, కేవైసీ, ఏటీఎం కార్డు అప్ డేట్ పేరుతో వచ్చే కాల్స్ కు స్పందించవద్దని ప్రజలను హెచ్చరిస్తున్నారు.

ఈ నేపథ్యంలో క్రిస్ట్ మస్, న్యూఇయర్, సంక్రాంతి సందర్భంగా ఇలాంటి మోసాలు భారీగా పెరిగాయి.అలాగే ఫిబ్రవరి 14 న వాలెంటైన్స్ డే సందర్భంగా కూడా ఇలాంటి మోసాలు జరిగే ఆస్కారం ఎక్కువగా ఉండబోతుందని సైబరాబాద్ పోలీసులు ముందు జాగ్రత్తగా హెచ్చరిస్తున్నారు.

అందుకోసం తాజాగా ట్విట్టర్ లో ‘ అడగందే అమ్మ కూడా అన్నం పెట్టదు అంటారు, మరి ఎవరో గిఫ్ట్ ఇస్తాడు అంటే ఎలా నమ్ముతారు? ‘ అని సైబరాబాద్ పోలీసులు చేసిన ట్వీట్ నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటుంది.దీనికి వారు బ్రహ్మానందం డైలాగ్ మీమ్ జతచేయడంతో ప్రజలకు మరింత చేరువయ్యింది.

https://twitter.com/cyberabadpolice/status/1356971950552215553

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube