ఆడు మ‌గాడ్రా బుజ్జి మీమ్‌ను వాడేసిన సైబ‌రాబాద్ సైబ‌ర్ వింగ్ పోలీసులు..

ఈ మ‌ధ్య సైబ‌ర్ నేర‌గాళ్లు ఎంతలా అరాచకాల‌కు పాల్ప‌డుతున్నారో అంద‌రికీ తెలిసిందే.అయితే వీరి ఆగ‌డాల‌కు పోలీసులు కూడా ఎప్ప‌టిక‌ప్పుడు క‌ళ్లెం వేస్తూనే ఉన్నారు.

 Cyberabad Cyber ​​wing Police Used Adu Mangadra Bujji Meem .., Cyberabad Pol-TeluguStop.com

ఇక సైబ‌ర్ పోలీసుల్లో సైబ‌రాబాద్ వింగ్ పోలీసుల స్టైలే వేరు.జ‌నాల‌కు అర్థ‌మ‌య్యే భాష‌లో అవ‌గాహ‌న క‌ల్పించ‌డంలో వారి త‌ర్వాతే ఎవ‌రైనా.

అవును మ‌రి ఇప్ప‌టికే ఎన్నో ర‌కాలుగా వారు సోష‌ల్ మీడియాలో అవ‌గాహ‌న క‌ల్పించారు.ఇక ఎప్ప‌టిక‌ప్పుడు కొత్త సినిమాల పోస్ట‌ర్ల‌ను మీమ్‌లు వాడేస్తూ బాగా అవ‌గామ‌న క‌ల్పిస్తుంటారు సైబ‌రాబాద్ వింగ్ పోలీసులు.

వీళ్లు త‌యారు చేసే మీమ్స్ అయితే సోస‌ల్ మీడియాలో మీమర్స్ చేసే వారికి కూడా రాని విధంగా వీరికి ఆలోచ‌న‌లు వ‌స్తుంటాయి.ఇక‌పోతే ఇప్పుడు మ‌రో అద్భ‌త‌మైన మీమ్‌ను వాడేశారు.

సైబర్ నేరంపై వీరు సోష‌ల్ మీడియా వేదిక‌గా షేర్ చేసిన ఒక మీమ్ ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది.ఫేస్ బుక్ యూత్‌ను అట్రాక్ట్ చేసి అమ్మాయిలుగా న‌మ్మించి చాటింగ్ చేస్తుంటారు దుండగులు.

అమ్మాయిల పేరుతో చాట్ చేసి త‌మ అకౌంట్లలోకి డ‌బ్బులు వేయాంటూ గాలం వేస్తున్న ఘ‌ట‌న‌లు వారి మాయ‌లో ప‌డి మోస‌పోతున్న వారి గురించి కూడా చూస్తూనే ఉన్నాం.

Telugu Athidhi, Avarnace, Cyberabad, Face, Mmem-Latest News - Telugu

ఇక ఇప్పుడు ఇలాంటి వారి మాయ‌లో ప‌డ‌కుండా ఉండేందుకు పోలీసులు తాజాగా ట్విటర్ వేదిక‌గా ఓ ఫన్నీ మీమ్‌ను షేర్ చేశారు.సూప‌ర్ స్టార్ మ‌హేశ్ బాబు చేసిన సినిమా అత‌డు లోని ఓ ఫేమస్ డైలాగ్ ను మీమ్ గా త‌యారు చేసి అప్‌లోడ్ చేశారు.ఈ సిఇన‌మాలోని ఆడు మ‌గాడ్రా బుజ్జి మీమ్‌ను చాలా చ‌క్క‌గా ఉప‌యోగించారు.

ఒక అమ్మాయి ఫేస్ బుక్‌లో చాటింగ్ చేస్తోంద‌ని మురిసిపోతున్న కొడుక్కు ఆడు మ‌గాడ్రా బుజ్జి అమ్మాయి కాదురా అని కౌంట‌ర్ వేసే తండ్రికి గ‌త‌గ్గ‌ట్టు మీమ్‌ను రెడీ చేసేశారు.మ‌రి ఇంకెందుకు లేటు మీరు కూడా చూసేయండి.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube