కరోనాని కూడా క్యాష్ చేసుకుంటున్న సైబర్ నేరగాళ్ళు

ఒకప్పుడు దొంగతనాలు అంటే దారిదోపిడీలు, ఇళ్ళల్లో పడి చోరీ చేయడం, బ్యాంకులని లూటీ చేయడం వంటివి జరిగేవి.అయితే టెక్నాలజీ పెరిగిపోవడంతో ఎక్కడికక్కడ సీసీ కెమెరాలు రావడంతో ఇలా జరిగే దొంగతనాల్లో నేరగాళ్ళు చాలా ఈజీగా, వేగంగా దొరికేస్తున్నారు.

 Cyber Fraud Through Facebook In The Name Of Corona-TeluguStop.com

ఒళ్ళు హూనం చేసుకొని దొంగతనం చేసిన ప్రయోజనం లేకుండా పోతుంది.ఈ నేపధ్యంలో నేరగాళ్ళు కూడా తెలివి మీరారు.

మనిషి ఆశలని లక్ష్యంగా చేసుకొని ఈజీగా తెలివితో దోచుకోవడం మొదలు పెట్టారు.నేరప్రవృత్తి ఉన్న వాళ్ళు టెక్నాలజీని వినియోగించుకొని అమాయక ప్రజలని లక్ష్యంగా చేసుకొని సైబర్ నేరాలకి పాల్పడటం మొదలు పెట్టారు.

 Cyber Fraud Through Facebook In The Name Of Corona-కరోనాని కూడా క్యాష్ చేసుకుంటున్న సైబర్ నేరగాళ్ళు-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

మొదట్లో ఆఫర్స్ అంటూ ఆశ చూపించి లక్షల సొమ్ము దోచుకునేవారు.అయితే అలాంటి ఫేక్ మెసేజ్ లు, ఫేక్ కాల్స్ పై ప్రజలకి అవగాహనా పెరగడంతో ఇప్పుడు సోషల్ మీడియాలో ఫ్రెండ్ షిప్, అలాగే డేటింగ్ యాప్స్ ద్వారా బ్లాక్ మైల్ చేస్తూ దోచుకోవడం మొదలు పెట్టారు.

ఇప్పుడు ఈ సైబర్ నేరగాళ్ళు మరో అడుగు ముందుకేసి పేస్ బుక్ లో ఫ్రెండ్స్ పేర్లతో ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసి మెసేజ్ లు పెట్టి అత్యవసరం అంటూ డబ్బులు దొబ్బెయడం స్టార్ట్ చేశారు.

ఇప్పుడు కరోనా దేశ వ్యాప్తంగా ప్రజలందరిని భయపెడుతూ ఉంటే దీనిని కూడా సైబర్ నేరగాళ్ళు క్యాష్ చేసుకోవడం మొదలు పెట్టారు.

రీసెంట్ గా హైదరాబాద్ లో ఓ కేసు ఫైల్ అయ్యింది.ఓ ఫ్రెండ్ కి తన బెస్ట్ ఫ్రెండ్ నుంచి మెసేజ్ వచ్చింది.కరోనా పాజిటివ్ వచ్చిందని, హాస్పిటల్ లో ఉన్నానని, మెడికల్ బిల్ కి డబ్బులు లేవని అతను మెసేజ్ చేశాడు.ఓ పదివేలు గూగుల్ ట్రాన్స్ ఫర్ చేస్తే బయటకి రాగానే ఇచ్చేస్తా అనే అందులో చెప్పాడు.

దీంతో మానవత్వంతో అతను పదివేలు ట్రాన్స్ ఫర్ చేశాడు.అయితే కొద్ది సేపటి తర్వాత మరల మందుల కోసం డబ్బులు కావాలని అడిగాడు.

దానికోసం మళ్ళీ పంపించాడు.రెండు రోజుల తర్వాత ఫ్రెండ్ కి ఫోన్ చేసి ఆరోగ్యం ఎలా ఉంది.

హాస్పిటల్ బిల్ కట్టేశార అనే అడిగాడు.దానికి నేను హాస్పిటల్ లో చేరలేదు.

నాకు ఎలాంటి కరోనా రాలేదని అతను క్లారిటీ ఇవ్వడంతో మోసపోయానని అర్ధం చేసుకున్న అతను సైబర్ క్రైమ్ పోలీసులని ఆశ్రయించాడు.ఇలాంటి కేసులు ఈ మధ్యకాలంలో తరుచుగా నమోదు అవుతున్నాయని తెలుసుకొని ఆశ్చర్యపోయాడు.

కరోనా, ఇతర ఆరోగ్య కారణాలు చెప్పి ఎవరైనా పేస్ బుక్ లో డబ్బులు కావాలని అడిగితే ట్రాన్స్ ఫర్ చేయొద్దని పోలీసులు తెలుపుతున్నారు.ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసి సైబర్ నేరగాళ్ళు ఇలా తమ ఉచ్చులోకి లాగుతున్నారని పేర్కొన్నారు.

#Fake Profiles #Cyber Crimes #Hyderabad #Asking Money #Corona Positive

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు