షర్మిలపై అసభ్య కామెంట్స్ చేసిన వ్యక్తి అరెస్ట్ !  

Cyber Crime Police Arrested One Person In Sharmila Case -

సినీ హీరో ప్రభాస్ కు తనకు మధ్య ఏదో సంభంధం ఉన్నట్టుగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున తప్పుడు ప్రచారం చేస్తూ… తమ ప్రతిష్ట దిగజారుస్తున్నారంటూ…వైసీపీ అధినేత జగన్ సోదరి షర్మిల గత కొద్ది రోజుల క్రితం ఇచ్చిన ఫిర్యాదు మేరకు ప్రకాశం జిల్లా చోడవరంకు చెందిన పెద్దిశెట్టి వెంకటేశ్‌ అనే వ్యక్తిని గుంటూరులో హైదరాబాద్ సీసీఎస్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు.గూగుల్‌ ఇచ్చిన ఐపీ అడ్రస్‌ ఆధారాలతో నిందితుడిని సీసీఎస్‌ పోలీసులు పట్టుకుని హైదరాబాద్‌ తరలించారు.

Cyber Crime Police Arrested One Person In Sharmila Case

అరెస్ట్ చేయబడిన వ్యక్తి గుంటూరులోని ఓ ప్రైవేట్‌ కాలేజీలో ఎంసీఏ చదువుతున్నాడు.నిందితుడిపై ఐపీసీ సెక్షన్‌ 509, 67ఐటీ యాక్ట్‌ కింద కేసులు నమోదు చేశారు.అలాగే ఇదే కేసులో మంచిర్యాలకు చెందిన మరో వ్యక్తిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.అతడిని కూడా హైదరాబాద్‌ తరలించే అవకాశాలు ఉన్నాయి.మరికొందరిని కూడా పోలీసులు విచారణ చేస్తున్నారు.ఓ అధికార పార్టీకి సంబంధించిన మూడు వెబ్‌సైట్‌లలోని పోస్ట్‌ల ఆధారంగా వీరంతా అసభ్యకర కామెంట్లు పెట్టినట్టు పోలీసులు గుర్తించారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Cyber Crime Police Arrested One Person In Sharmila Case Related Telugu News,Photos/Pics,Images..

footer-test