దేవుళ్ళ పేరు పెట్టారని ఆ సినిమాపై సైబర్ క్రైమ్ లో ఫిర్యాదు

సురేష్ ప్రొడక్షన్స్, వయాకామ్ 18 స్టూడియోస్ సంయుక్తంగా తెరకెక్కించిన కృష్ణ అండ్ హిజ్ లీల సినిమా తాజాగా ప్రేక్షకుల ముందుకి వచ్చింది.ఈ సినిమాలో సిద్ధూ, శ్రద్ధా శ్రీనాథ్, సీరత్ కపూర్ లాంటి భామలు ప్రధాన పాత్రలు చేశారు.

 Cyber Crime Complaint Against Krishna And His Leela, Tollywood, Bollywood, Telug-TeluguStop.com

నెట్ ఫ్లెక్స్ లో రిలీజ్ అయిన ఈ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.ప్రెజెంట్ ట్రెండ్ కి తగ్గట్లు ఈ సినిమా ఉండటంతో యూత్ కి భాగా కనెక్ట్ అయ్యింది.

ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమాపై సైబర్ క్రైమ్ కంప్లైంట్ రిజిస్టర్ అయ్యింది.ఈ మధ్య కాలంలో ప్రతి చిన్న విషయాన్ని బూతద్దంలో పెట్టి చూపిస్తూ వివాదంగా మారుస్తున్నారు.

సినిమాలో ఏం చూపించిన మనోభావాలు దెబ్బ తిన్నాయి అంటూ మీడియా ముందుకి వస్తున్నారు.కొద్ది రోజులు హడావిడి చేస్తున్నారు.

అయితే ఈ సినిమా టైటిల్ ఎప్పుడో ప్రకటించిన రిలీజ్ ఎవరకూ ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయని వారు తాజాగా ఈ సినిమా టైటిల్, హీరో, హీరోయిన్ల పేర్లు వివాదాస్పదమయ్యాయి.ప్రధాన పాత్రలకు హిందూ దేవతల పేర్లను పెట్టారంటూ సైబర్ క్రైమ్ కు రాకేశ్ అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు.

హీరో, హీరోయిన్లకు దేవుళ్ల పేర్లను పెట్టడమే కాకుండా, వారి మధ్య మోతాదు మించిన రొమాన్స్ సన్నివేశాలను పెట్టారని ఫిర్యాదులో ఆరోపించారు.ఆ చిత్ర ప్రసారం నిలిపివేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

అయితే ఈ సినిమా మీద అనవసరమైన రచ్చ చేస్తున్నారని, దేవుళ్ళ పేరుతో ఇప్పటికే చాలా సినిమా టైటిల్స్ వచ్చాయని, దేనికి లేని అభ్యంతరం దీనికి ఎందుకని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube