కొవిడ్‌ పాజిటివ్‌ వ్యక్తికి షాకిచ్చిన సైబర్ నేరగాళ్లూ.. ఐసొలేషన్ పేరుతో టోకరా.. !

మోసగాళ్లూ రోజు రోజుకు ఊసరవెల్లిలా రంగులు మారుస్తూ ప్రజలను దోచుకుంటున్న విషయం తెలిసిందే.ఈ విషయంలో అవగహన ఎంతలా కలిగిస్తున్న మోసగాళ్లూ మారడం లేదు.

 Cyber Who Shocked Covid Positive Person-TeluguStop.com

అదే సమయంలో ప్రజలు కూడా అలర్ట్ అవడం లేదు.దీని వల్ల మోసపోయే వారి సంఖ్య నిత్యం పెరుగుతూనే ఉంది.

ఇకపోతే చివరికి కోవిడ్ పేరును కూడా వాడుకుని చీటింగ్ చేస్తున్నారు సైబర్ నేరగాళ్లూ.ప్రస్తుతం ఇలాంటి ఘటన వెలుగులోకి వచ్చింది ఆ వివరాలు చూస్తే.నగరానికి చెందిన ఓ వ్యక్తికి కొవిడ్‌ పాజిటివ్‌ వచ్చింది.ఈ క్రమంలో ఐసొలేషన్‌ కోసం ఓయో రూంలను తీసుకోవాలనే ఉద్దేశంతో కస్టమర్‌ కేర్‌ నంబర్‌ కోసం గూగుల్‌ సర్చ్‌ చేశాడు.

 Cyber Who Shocked Covid Positive Person-కొవిడ్‌ పాజిటివ్‌ వ్యక్తికి షాకిచ్చిన సైబర్ నేరగాళ్లూ.. ఐసొలేషన్ పేరుతో టోకరా.. -Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అక్కడ కనిపించిన నంబర్‌కు కాల్ చేయగా తాము ఓయో రూమ్స్‌ కస్టమర్‌ కేర్‌ ప్రతినిధులమంటూ సైబర్‌నేరగాళ్లు వల విసిరారు.

ఆ వలలో పడిన కోవిడ్ పేషంట్ వారు చెప్పినట్లే క్విక్‌ సపోర్టు యాప్‌ను డౌన్‌లోడ్‌ చేశాడు.ఆ తర్వాత వచ్చిన కోడ్ చెప్పడంతో సైబర్‌నేరగాళ్లు బాధితుడికి తెలియకుండానే ఇతని సెల్ తమ ఆధీనంలోకి తీసుకుని బ్యాంకు వివరాలు తెలుసుకుని రూ.3.5లక్షలు కాజేశారు.ఈ విషయాన్ని గ్రహించిన బాధితుడు సైబర్‌ క్రైం పోలీసులను ఆశ్రయించాడట.

కాబట్టి ప్రజల్లారా ఈ విషయంలో అప్రమత్తంగా ఉండండి.

#Person #Isolation #COVID Positive #Shocked #Cyber Criminals

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు