మరో ఏడాది వరకు ఆమే బాస్?

ఎవరు ఈ బాస్? కంపెనీ యజమాని కాదు.సీఈవో కాదు.

 Sonia’s Term Likely To Be Extended By A Year?-TeluguStop.com

ప్రభుత్వ అధినేత కాదు.కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధి.

కేంద్రంలో అధికారంలోకి రాక, పలు రాష్ట్రాల్లో పవర్ లేక కాంగ్రెస్ చతికిలబడింది.అయితే దాన్ని లేపి నిలబెట్టే సమర్ధులు ప్రస్తుతం ఎవరూ లేరు.

వాస్తవానికి సోనియా ఆరోగ్యం బాగా లేదు.పార్టీ ప్రెసిడెంటుగా కుమారుడు, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని నియమించి తను తెర వెనుక ఉండి సలహాలు, సూచనలు ఇవ్వాలని అనుకుంది.

కాని రాహుల్కు ఇప్పుడే పగ్గాలు అప్పగిస్తే సమర్ధంగా చేయగలడా? లేదా? అనే అనుమానం కూడా ఉంది.తొందరలో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి.

వచ్చే ఏడాది రెండో, మూడో రాష్ట్రాల్లో ఎన్నికలు జరగబోతున్నాయి.ఈ ఎన్నికల్లో సత్తా చాటితే కాంగ్రెస్ 2019 లోక్ సభ ఎన్నికల్లో గెలిచే అవకాశం ఉండొచ్చు.

అందుకే మరో ఏడాది వరకు సోనియా గాంధీయే పార్టీకి నాయకత్వం వహిస్తారని సమాచారం.ఈ ఏడాది డిసెంబర్ తో ఆమె పదవీ కాలం ముగుస్తుంది.

పదవీ కాలం పెంచాలంటే పార్టీ అత్యున్నత విధాన నిర్ణాయక విభాగమైన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నిర్ణయం తీసుకోవాలి.ఇందుకోసం కమిటీ ఈ నెల (సెప్టెంబర్) 8న సమావేశం కాబోతున్నది.

ఈ సమావేశంలో సోనియా పదవీ కాలం పెంచుతూ తీర్మానం చేసే అవకాశం ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube