వార్ని.. బర్త్ డే కేక్ ను ఇలా కూడా కట్ చేస్తారా, సరదాగా చేస్తే దూల తీరింది

బర్త్ డే పార్టీలో కొందరు అల్లరి చిల్లరగా ప్రవర్తించడం కామన్.కొందరు తాగిన మత్తులో బర్త్ డే కేక్ ను రాక రకాలుగా కట్ చేస్తూ ఉంటారు.

 Cutting Cake With Gun Goes Viral Social Media-TeluguStop.com

కేక్ ను కొందరు మొహానికి పూసుకోవడం తో పాటు ఇష్టం వచ్చినట్లుగా రుద్దుకోవడం చేస్తున్నారు.కేక్ కట్టింగ్ లో కొందరు కొన్ని రకాల పద్ధతులు వాడుతూ ఉంటారు.

ఉత్తర ప్రదేశ్ లో ఒకడు కేక్ ను కత్తి తో కాకుండా గన్ తో పేల్చి అందరూ అవాక్కయ్యేలా చేసాడు.ఇది కరెక్ట్ గా ఎక్కడ జరిగిందో తెలియడం లేదు, కానీ ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అయ్యింది.

ఈ వీడియో ను పీయూష్ రాయ్ అనే వ్యక్తి ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు.ఈ వీడియో వెంటనే వైరల్ అయ్యింది.పోలీసులు ఈ వీడియో ఎక్కడ జరిగింది తీశారు అనేది ఎంకౌరి చేస్తున్నారు.వీడియోను పోస్ట్ చేసిన వ్యక్తి దీనిని మీరట్ లో జరిగిందని చెప్పాడు.కానీ ఈ వీడియో మీరట్ కు చెందినది కాదని అక్కడి పోలీసులు నిర్ధారించారు.పోలీసులు ప్రస్తుతం ఆ సంఘటన ఎక్కడ జరిగిందనే విషయంపై ఎంకౌరి చేస్తున్నారు.

పోలీసులు ఈ సంఘటనపై సీరియస్ గా ఉన్నారు.ఇలాంటి సంఘటనలు సీరియస్ గా తీసుకోవాలని పోలీసులు భావిస్తున్నారు.కేక్ ను గన్ తో పేల్చడం నేరంగా పోలీసులు పరిగణిస్తున్నారు.దీనికి వారు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని పోలీసులు హెచ్చరిస్తున్నారు.టిక్ టాక్ వీడియో కోసం అతడు ఇలా చేసినట్లుగా అనిపిస్తుంది.అలాంటి ప్రయత్నాలు చాలా ప్రమాదకరం, ఇలాంటివి ఎట్టి పరిస్థితుల్లో హర్షణీయం కాదు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube